Priyanka Jawalkar: ఓర చూపుల చిన్నది.. క్రేజీ లుక్స్‌తో పిచ్చెక్కిస్తోన్న విజయ్ దేవరకొండ హీరోయిన్

Mon, 11 Apr 2022-3:10 pm,

ప్రియాంక జవాల్కర్ మరాఠీ కుటుంబానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ ఆమె పుట్టింది ఏపీలోని అనంతపురం జిల్లాలో. కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన జవాల్కర్.. ఆ తర్వాత మోడల్‌గా, నటిగా అడుగులు వేశారు.  

2017లో వచ్చిన 'కల వరం ఆయే' సినిమాతో ప్రియాంక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2018లో హీరో విజయ్ దేవరకొండ సరసన 'ట్యాక్సీవాలా' సినిమాలో ‌హీరోయిన్‌గా నటించారు.  

ట్యాక్సీవాలా సినిమాతో ప్రియాంక జవాల్కర్‌కు మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత తెలుగులో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి.

2021లో హీరో సత్యదేవ్ సరసన తిమ్మరుసు అనే క్రైమ్ థిల్లర్‌లో ప్రియాంక జవాల్కర్ నటించారు.  

ప్రియాంక జవాల్కర్ గతేడాది రిలీజ్అయిన ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమాతో ట్యాక్సీవాలా తర్వాత మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ఏడాది గమనం సినిమాతో ప్రియాంక ప్రేక్షకుల ముందుకు రానుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link