Shalini Pandey: అబ్బాయిలతో రూమ్ షేర్ చేసుకున్న అర్జున్ రెడ్డి బ్యూటీ.. అలా దుస్తులు మార్చుకున్నా..!
షాలినీ పాండే 1993 సెప్టెంబర్ 23న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించింది. చదువుకునే రోజుల్లోనే సినిమాల్లో నటించాలని ఆసక్తి ఉందని తండ్రికి చెప్పగా.. ఆయన ఇంజినీరింగ్ చేయాల్సిందేనని పట్టుబట్టారు.
అయితే తండ్రిని ఒప్పించేందుకు నాలుగేళ్లు ప్రయత్నించినా.. ఆయన అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి పారిపోయి ముంబైకి వెళ్లిపోయింది.
అలా ఇంటి నుంచి వచ్చే తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి రూమ్‌లో ఉంది. అయితే వాళ్ల దగ్గర ఉండలేకపోయింది. ఆ తరువాత అబ్బాయిలతో రూమ్ షేర్ చేసుకున్నట్లు షాలినీ పాండే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
వాళ్లతో భయపడకుండా ఉన్నానని.. బట్టలు మార్చుకునేందుకు ప్లేస్ లేకపోయినా చాటుగా మార్చుకునేదాన్ని అని గుర్తు చేసుకుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అక్కడే ఉండి.. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించానని తెలిపింది.
ఆ సమయంలోనే తనకు సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమాలో ఛాన్స్ ఇచ్చారని.. తన ఫస్ట్ మూవీ అయినా భారీ విజయం సాధించడంతో పాపులారిటీ వచ్చిందని షాలినీ పాండే చెప్పింది.
స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవడంతో తన కుటుంబం అండగా నిలిచిందని తెలిపింది. విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ రావడమే తాను అదృష్టంగా భావించానని పేర్కొంది.