Vijay Devarkonda: ఆదివారం మన రౌడీ హీరో ఏం చేస్తారో తెలుసా?
మొదట్లో ఎన్నో చిన్న సినిమాలలో.. చిన్న క్యారెక్టర్స్ చేస్తూ సినిమాల్లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. నాగ అశ్విన్ దర్శకత్వంలో.. నాని హీరోగా వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించి మెప్పించారు.
అయితే హీరోగా విజయ్ దేవరకొండకి విజయం.. అందించిన మొదటి చిత్రం పెళ్లి చూపులు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రీతు వర్మ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం.. విజయ్ దేవరకొండ కెరియర్ లో మొదటి కమర్షియల్ సక్సెస్ను అందించింది. ఇక ఆ తరువాత సందీప్ రెడ్డి.. దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు.
అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ కి రౌడీ హీరో అని పేరు కూడా తెచ్చిపెట్టింది. ఇక రౌడీ అనే బ్రాండ్ కూడా మొదలుపెట్టారు ఈ హీరో. మరోపక్క ఈమధ్య ఈ హీరో చేసిన కొన్ని సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలాయి. గీతా గోవిందం సినిమా తరువాత విజయ్ నటించిన ఏ చిత్రం కూడా సూపర్ సక్సెస్ సాధించలేకపోయింది..
ఈమధ్య వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా సైతం డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ హీరోకి ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఈ హీరో.. పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాజాగా విజయ్ దేవరకొండ డైరెక్టర్ అసోసియేషన్ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో ఎల్లో షర్టులో.. రౌడీ లుక్స్ లో తెగ అలరించారు ఈ హీరో.
అయితే ఇదే డ్రెస్సులో.. టెన్నిస్ ఆడుతూ.. ఆ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు విజయ్. ఇందులో విశేషమేమిటి అంటే ఈ ఫొటోస్ కి రౌడీ సందే అంటూ క్యాప్షన్ ఇచ్చారు. మొత్తానికి మన రౌడీ హీరో సన్డేసి ఇలా ఏదో ఒక గేమ్ ఆడుతూ గడుపుతారని ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చారు.