Vijay Mallya Home Pics: విజయ్ మాల్యా ఇంటిని చూశారా.. భూలోక స్వర్గమే!

Fri, 20 Dec 2024-5:16 pm,
Vijay Mallya Kingfisher Towers Pent House Photos 1

వెలుగు వెలిగిన మాల్యా: భారత పారిశ్రామికవేత్తగా ఒక వెలుగు వెలిగిన విజయ్‌ మాల్యా అనంతరం జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో అతడు భారతదేశాన్ని వదిలి పారిపోయాడు.

Vijay Mallya Kingfisher Towers Pent House Photos 3

పైకప్పు: విజయ్‌ మాల్యా బెంగళూరులో నివాసం ఉన్న విషయం తెలిసిందే. భూమికి 400 అడుగుల ఎత్తులో 34 అంతస్తుల భవనం పైకప్పుపై రెండంతస్తుల నివాసం నిర్మించుకున్నాడు. 

Vijay Mallya Kingfisher Towers Pent House Photos 5

శ్వేత సౌధంలా: ఆ ఇంటిపై నుంచి చూస్తే బెంగళూరు నగరం మొత్తం కనిపిస్తుంది. ఈ బంగ్లా అమెరికా అధ్యక్ష నివాసం శ్వేతసౌధంలా ఉంటుంది.

కింగ్‌ ఫిషర్‌ టవర్స్‌: బెంగళూరులోని యూబీ సిటీలోని కింగ్‌ఫిషర్ టవర్‌పై విజయ్‌ మాల్యా నివాసం ఉంటుంది. మొత్తం 4.5 ఎకరాల్లో విస్తరించి ఉంది.

భారీగా అంతస్తులు: విజయ్ మాల్యాకు దేశంలో చాలా ఇళ్లు ఉన్నా కూడా బెంగళూరులోని కింగ్‌ఫిషర్ టవర్స్‌లో ఉన్న ఈ భవనం అత్యంత ప్రత్యేకం. ఈ భవనంలో 33 అంతస్తులు, 81 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి.

పెంట్‌ హౌస్‌: బెంగుళూరులోని ఒక ఆకాశహర్మ్యం పైన 40,000 చదరపు అడుగుల పెంట్ హౌస్ ఉంది. ఇది తెలుపు రంగులో ధగధగలాడుతూ ఉంది.

విలాసవంతమైన సౌకర్యాలు: ఈ ఇంటిలో ఓపెన్ స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్ వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. ఇంట్లో మాల్యా వ్యక్తిగత లాబీ.. ఇల్లు-కార్యాలయం, ప్రైవేట్ లిఫ్ట్ ఉన్నాయి.

కళ్లు చెదిరే రేటు: అపార్ట్‌మెంట్లు 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. మాల్యాకు చెందిన ఈ ప్యాలెస్ ధర 20 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.170 కోట్లు.

ఒక్కో ఫ్లాట్ ధర: ఈ భవనంలో ఒక ఫ్లాట్ ధర రూ.50 కోట్లకు పైగా ఉంటుంది. దేశంలోని చాలా మంది బిలియనీర్ వ్యాపారవేత్తలు ఈ సొసైటీలో ఫ్లాట్‌లను కలిగి ఉన్నారు.

ప్రముఖుల నివాసం: కింగ్ ఫిషర్ టవర్స్ లో ఇన్ఫోసిస్‌కు చెందిన నారాయణ మూర్తి, సుధా మూర్తి, జెరోడాకు చెందిన నిఖిల్ కామత్, బయోకాన్‌కు చెందిన కిరణ్ మజుందార్ షా వంటి చాలా మంది వ్యాపారవేత్తలు ఈ భవనంలో ఇళ్లను కొనుగోలు చేశారు.

ఇతరులు నివాసం: ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఈ ఇంట్లో మాల్యా ఉండలేకపోగా.. ప్రస్తుతం అతడి కొడుకు కోడలు నివసిస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link