Vijay Sethupathi Net Worth 2024: అమ్మ బాబోయ్.. విజయ్ సేతుపతికి ఇన్ని ఆస్తులా?.. బిగ్‌బాస్ హోస్ట్‌గా దిమ్మతిరిగే రెమ్యురేషన్..
విజయ్ సేతుపతి కి అద్భుతమైన క్రేజ్ లభించింది.. కాబట్టి ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు 20 నుంచి 50 కోట్ల వరకు రెమ్యూరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ సేతుపతి నటించిన అనేక సినిమాలు వరుస రిలీజ్ కు సిద్ధంగా ఉన్నట్లు అధికారిక సమాచారం. అయితే వీలైనంత తొందరలోనే ఈ సినిమాలు విడుదల కాబోతున్నాయి.
విజయ్ సేతుపతి సినిమాల్లోనే నటించడం కాకుండా ఇటీవలే తమిళ బిగ్ బాస్ సీజన్ 8కి హోస్ట్ గా కూడా పనిచేస్తున్నారు. ఈ షో ఒక్కదానికే ఆయన దాదాపు 60 కోట్లకు పైగా రెమినేషన్ తీసుకున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఒకపక్క సినిమాల్లో కూడా నటించడంతో ఆయన ఆదాయం విపరీతంగా పెరిగిందని తెలుస్తోంది.
ఇక ఆయనకు సంబంధించిన ఆస్తుల వివరాల్లోకి వెళితే.. విజయ్ సేతుపతి గతంలో నాలుగు కోట్లకు పైగా విలువ ఉండే మెర్సిడెస్ వాగన్ కారుని కొనుగోలు చేస్తారు. దీంతోపాటు విజయ్ సేతుపతికి బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్‌కు సంబంధించిన ఒక ఖరీదైన కారు కూడా ఉన్నట్లు సమాచారం. ఇవే కాకుండా ఆయనకు మరికొన్ని కార్లు ఉన్నట్లు తెలుస్తోంది.
విజయ్ సేతుపతి కి ఆస్తుల్లో భాగంగా ఒక ప్రముఖ హెయిర్ కేర్ బ్రాండ్ కూడా ఉందట.. అదేదో కాదు రువా పేరుతో హెయిర్ కేర్ బ్రాండ్ ఓనర్ గా విజయ్ సేతుపతి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ హెయిర్ కేర్ సెంటర్ భారత్లో అత్యున్నత నగరాల్లో అందుబాటులో ఉంది.
అంతేకాకుండా విజయ్ సేతుపతి కొన్ని యాడ్స్లలో కూడా కనిపిస్తున్నారు. అయితే చిన్న బ్రాండ్లకు సంబంధించిన యాడ్స్ లో నటించిన అందుకు ఆయన ఏకంగా రెండు నుంచి నాలుగు కోట్లకు పైగా రెమ్యురేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే పెద్ద బ్రాండ్లకు సంబంధించిన కంపెనీల యాడ్స్ కి ఇంకా ఎక్కువగానే తీసుకుంటున్నారట.
ఇక విజయ్ సేతుపతి ప్రస్తుత విషయానికొస్తే.. ఆయన గాంధీ టాక్స్ అనే మూవీలో ప్రధాన పాత్రధారులుగా కొనసాగుతున్నారు. ఈ సినిమాపై త్వరలోనే కీలక ప్రకటనను సినీ బృందం విడుదల చేయబోతున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇవే కాకుండా విజయ్ సేతుపతి అనేక మూవీలో విలన్ క్యారెక్టర్ గా కూడా చేస్తున్నారట.