Khairatabad 2024: ఖైరతాబాద్ బడాగణేష్ కు 70 ఏళ్లు.. ఈసారి స్పెషాలిటీలు ఏంటో తెలుసా..?

Fri, 06 Sep 2024-11:14 am,

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన వినాయక చవితి సందడి మొదలైంది.ఈ నేపథ్యంలో.. వినాయక చవితిని ఈసారి సెప్టెంబర్ 7 న జరుపుకుంటున్నాంట. ఇప్పటికే ఎక్కడ చూసిన కూడా వినాయకుడి మండపాల ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలంతా వినాయక చవితిని ఎంతో భక్తితో జరుపుకుంటారు.  

మరోవైపు వినాయక చవితి అంటే చాలా మంది హైదరాబాద్ వాసులకు.. ఖైరతాబాద్ గణేషుడు ఎంతో స్పెషల్ గా చెప్తుంటారు. ఖైరతాబాద్ గణపయ్య ప్రతిష్టాపన అనేది 70 ఏళ్లు పూర్తి చేసుకుంది.అందుకే ఈసారి 70 అడుగుల వినాయకుడ్ని ఏర్పాటు చేశారు. 

అంతేకాకుండా..  ఈసారి వినాయకుడికి సంబంధించి 7 అంకె ట్రెండింగ్ లో నిలిచింది. సెప్టెంబరు 7 న వినాయక చవితి, సెప్టెంబరు 17 న నిమజ్జనం, ఖైరతాబాద్ గణేషుడికి 70 ఏళ్లు పూర్తయ్యాయి. అందుకే ఈ సారి ఖైరతాబాద్ గణేషుడికి సప్తముఖ గణపయ్య రూపంలో భక్తులకు దర్శనమివ్వబోతున్నారు.  

 భారీ గణపతి భక్తుల పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు. ముహూర్తం ప్రకారం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శిల్పి చినస్వామి రాజేంద్రన్‌.. ఏడుపడగల ఆదిశేషుడి నీడలో ఏడుపదుల అడుగుల్లో కొలువుదీరిన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి నేత్రాలంకరణ గురువారం ఉదయం వేడుకగా సాగింది.    

గణపతికి నేత్రాలను తీర్చిదిద్ది విగ్రహానికి ప్రాణం పోశారు. భక్తులు పెద్ద ఎత్తున జయజయ ధ్వానాలు చేస్తూ గణేష్‌ మహారాజ్‌కీ జై అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఉత్సవ కమిటీ కన్వీనర్‌ సందీప్‏రాజ్‌, కార్యదర్శి రాజ్‌కుమార్‌, ఉత్సవ కమిటీ ప్రతినిధులు గుమ్మడికాయలు కొట్టి పూజలు చేశారు.

యువతతో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్‌, కార్పొరేటర్‌ విజయారెడ్డి డాన్స్‌ చేసి సరదాగా గడిపారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా ఈ సందర్భంగా విచ్చేశారు. బందోబస్తుకు 3 షిఫ్టుల్లో 400 మంది పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్‌ గణపతిని దర్శించుకునేందుకు ఈసారి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉండడం, శని, ఆదివారాలు రెండు సార్లు రావడంతో పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. 

తొలిరోజునే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు గవర్నర్‌లు పూజలకు రానుండడంతో 24 గంటల పాటు పోలీసులు 3 షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. భారీ గణపతి వద్ద బందోబస్తు కోసం ముగ్గురు డీఎస్‌పీలు, 13 మంది ఇన్‌స్పెక్టర్లు, 33 మంది ఎస్‌ఐలు, 22 ప్లాటూన్ల సిబ్బంది పనిచేస్తారని సైఫాబాద్‌ ఏసీపీ ఆర్‌ సంజయ్‌ కుమార్‌ తెలిపారు.

ఖైరతాబాద్‌ భారీ గణపతికి ఎప్పటిమాదిరిగానే ఖైరతాబాద్‌ పద్మశాలీ సంఘం వారు జంధ్యం, కండువా, నూతన పట్టువస్త్రాలను సిద్ధం చేశారు. గురువారం ఖైరతాబాద్‌ పద్మశాలి సంఘం కార్యాలయంలో అధ్యక్షుడు కడారి శ్రీధర్‌, గౌరవ అధ్యక్షులు గుర్రం కొండయ్య, ప్రధాన కార్యదర్శి ఏలె స్వామి వీటిని ప్రదర్శించారు. ఈసారి 75 అడుగుల భారీ జంధ్యం, కండువాలతో పాటు నైపుణ్యం కల చేనేత కళాకారులతో వీటిని తయారు చేయించినట్లు తెలుస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link