Vinesh Phogat: ఒలింపిక్స్‌లో వినేశ్ ఫొగాట్ సంచలనం.. సెమీ ఫైనల్లోకి ప్రవేశం
పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కిలోల ప్రిక్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన డిఫెండింగ్ చాంపియన్ యువి సుసాకితో వినేశ్ ఫొగాట్ తలపడ్డారు. 3-2తో వినేశ్ ఫొగాట్ సంచలన విజయం సాధించారు.
ప్రిక్వార్టర్స్‌లో ఆఖరి వరకు వెనుకబడిన వినేశ్ ఫొగాట్ అనంతరం గొప్పగా పుంజుకుని ప్రపంచ నంబర్ వన్ రెజ్లర్ సుసాకిని చిత్తు చేసింది.
క్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన ప్రొవొకేషన్‌పై వినేశ్ ఫొగాట్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించారు. 7-5 తేడాతో విజయం సాధించి సెమీ ఫైనల్లోకి వినేశ్ ఫొగాట్ ప్రవేశించారు.
సెమీ ఫైనల్‌లో వినేశ్ ఫొగాట్ క్యూబాకు చెందిన రెజ్లర్ యస్‌నెలిస్ గుజ్మన్‌ను ఢీకొట్టనున్నారు. హోరాహోరీగా జరగనున్న సెమీస్‌లో వినేశ్ ఫొగట్ ప్రదర్శనపై అత్యంత ఉత్కంఠ నెలకొంది.
సెమీస్‌లో గెలిస్తే ఫైనల్‌లోకి అడుగుపెట్టి బంగారు పతకం కోసం వినేశ్ పోరాడనున్నారు. సెమీస్‌లో ఓడిపోతే కాంస్యంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి.
రెజ్లర్లపై లైంగిక దాడి విషయమై వినేశ్ ఫొగాట్ ఢిల్లీలో కొన్ని రోజుల తరబడి ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ ఇతరులు ఎవరూ పట్టించుకోలేదు. ఆ సమయంలో వినేశ్ ఫొగాట్‌ను పోలీసులు ఈడ్చి తీసుకెళ్లారు.
ఢిల్లీలో రోడ్లపై ఈడ్చుకెళ్లిన వినేశ్ ఫొగాట్ ఇప్పుడు అంతర్జాతీయ క్రీడా పోటీల్లో భారతదేశానికి పతకం తీసుకురాబోతున్నది. దీంతో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చురకలు అంటిస్తున్నాయి.