Amritha Aiyer Photos: పట్టుచీరలో అమృత అయ్యర్.. అమ్మాయి గారిని ఇలా ఎప్పుడు చూసుండరు!!
తాజాగా అమృత అయ్యర్ పట్టుచీరలో ఓ ఫోటో షూట్ చేశారు. అందులో ఆమె తెలుగుతనం ఉట్టిపడేలా ఉన్నారు.
అమృత అయ్యర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలు, సినిమాకు సంబందించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తుంటారు.
ఇటీవల శ్రీ విష్ణుతో కలిసి 'అర్జున ఫాల్గుణ' సినిమాలో అమ్మాయి గారు నటించి మెప్పించారు.
రెడ్ అనంతరం యాంకర్ ప్రదీప్ మాచిరాజుతో కలిసి '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ సినిమాలో అమ్మాయి గారిగా అందరి మనసుల్లో నిలిచిపోయారు.
టాలీవుడ్ ఎనర్జటిక్ హీరో రామ్ పోతినేని నటించిన 'రెడ్' సినిమాతో అమృత అయ్యర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన 'బిగిల్' సినిమాతో యువ హీరోయిన్ అమృత అయ్యర్ మంచి పేరు తెచ్చుకున్నారు. హాకీ టీమ్ కెప్టెన్‌గా అద్భుతంగా ఆకట్టుకున్నారు.