Virat Kohli: విరాట్‌ కోహ్లీకి ప్రమాదకరమైన వ్యాధి.. షాక్‌కు గురయిన ఫ్యాన్స్‌

Wed, 06 Nov 2024-4:12 pm,

షాకింగ్‌ విషయం: నవంబర్ 5వ తేదీన విరాట్ కోహ్లీ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. అదే రోజు కోహ్లీకి సంబంధించి షాకింగ్‌ విషయం బయటకు వచ్చింది.

ఫిట్‌నెస్‌ రారాజు: విరాట్ అత్యుత్తమ క్రికెటర్‌ అని అందరికీ తెలిసిందే. క్రికెట్‌తోపాటు తన శరీరాన్ని నియంత్రణలో ఉంచుకునేందుకు నిత్యం ఫిట్‌నెస్‌ చేస్తుంటాడు. ఫిట్‌నెస్‌, డైట్‌ విరాట్‌ కోహ్లీ కఠినంగా పాటించడానికి ఒక కారణం ఉందని తెలిసింది. వాటిని అంత కఠినంగా అమలు చేయడం వెనుక కోహ్లీ అనారోగ్యం దాగి ఉందని తెలిసింది.

క్రికెట్‌కు దూరం: గతంలో విరాట్‌ కోహ్లీకి హార్నియేటెడ్ డిస్క్ అనే సమస్య వచ్చింది. దీని కారణంగా 2018 ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు విరాట్‌ కోహ్లీ దూరమయ్యాడు.

వ్యాధి ఇదే: హార్నియేటెడ్ డిస్క్ అనే వ్యాధిని స్లిప్డ్‌ డిస్క్‌ లేదా డిస్క్‌ ప్రొలాప్స్‌ అని కూడా పిలుస్తుంటారు. వెన్నెముక భంగిమ మారడం వలన ఈ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్యకు వైద్యం ఉంది. అయితే ఈ సమస్య తీవ్రమైతే మాత్రం తప్పనిసరిగా శస్త్ర చికిత్స చేయాల్సి ఉంది.

కారణాలు: హర్నియేటెడ్ లేదా స్లిప్ డిస్క్ అనే సమస్యకు చాలా కారణాలు ఉన్నాయి. ఈ సమస్య మహిళల కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం.. సక్రమంగా కూర్చోకపోవడం.. ఇబ్బందికర పరిస్థితుల్లో కూర్చోవడం.. వంగడం.. బరువైన వస్తువులను మోయడం, వెన్నెముకకు గాయం వంటివి ఈ సమస్యకు కారణాలుగా ఉన్నాయి.

లక్షణాలు: స్లిప్ డిస్క్ అనే సమస్య తిరగకుండా చేస్తుంది. విపరీతంగా వెన్నునొప్పి, చేతివేళ్లు, కాళ్లకు తిమ్మిర్లు ఏర్పడతాయి. ఎముకలను బలహీనపరుస్తాయి. 

పరిష్కారం: ఈ సమస్యను ముందే గుర్తిస్తే మందుల ద్వారా నయం అవుతుంది. సమస్య తీవ్రమవడం.. నిర్లక్ష్యం చేస్తే మాత్రం శస్త్ర చికిత్సకు వెళ్లాల్సిందే.

మాంసాహారం దూరం: ఈ సమస్యతోపాటు వెన్నెముక (సర్వైకల్‌ స్పైన్‌) కూడా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే విరాట్‌ తనకు ఎంతో ఇష్టమైన మాంసాహారానికి దూరమయ్యాడు.

మరో సమస్య: సర్వైకల్‌ స్పైన్‌ సమస్య వస్తే వణుకుడు రోగం వస్తుంది. అంతేకాకుండా కడుపులో సమస్యలు రావడం.. యూరిక్‌ యాసిడ్‌ స్థాయి పెరగడం వంటివి జరుగుతాయి. ఈ సమస్యల కారణంగానే కోహ్లీ తన ఆరోగ్ంపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాడు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link