Vitamin B12 Deficiency: విటమిన్ బి12 లోపం యమ డేంజర్‌.. ఎందుకో తెలుసా?

Wed, 31 Jul 2024-12:12 pm,

శరీరానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేయడానికి విటమిన్ బి12 కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ లోపం వంటి సమస్యలతో బాధపడేవారికి అలసట, నీరసం వంటి సమస్యలు వస్తాయి.

చర్మం పసుపు రంగులోకి మారడం, చర్మం ఎండిపోవడం వంటి సమస్యలు రావడానికి కూడా ఈ విటమిన్ బి12 లోపం ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొంతమందిలో దురద వంటి సమస్యలు కూడా వస్తాయి.

బి12 లోపం వల్ల జుట్టు ఊడి పోవడం, జుట్టు తెల్లబడటం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

నాలుక ఎర్రగా మారడం, నోరు పూత రావడం, నోరు పగలడం వంటి సమస్యలు కూడా బి12 లోపమే ప్రధాన కారణమని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా దీనికి సంబంధించిన సప్లిమెంట్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది.  

బి12 లోపం వల్ల మెదడుకు సరిపడా ఆక్సిజన్ అందకపోవడం వల్ల మగతగా అనిపించడం, నిద్ర సమస్యలు వంటివి ఏర్పడతాయి. దీని కారణంగా చాలా మంచి పని సమయాల్లో కూడా నిద్రపోతారు.   

బి12 లోపం వల్ల కండరాలు బలహీనపడటం, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వంటి సమస్యలు కూడా కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ సప్లిమెంట్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. 

బి12 లోపం వల్ల మెదడు పనితీరుపై ప్రభావం పడి మతిమరుపు, ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విటమిన్‌ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.

విటమిన్‌ బి12 లోపం వల్ల హోమోసిస్టైన్ అనే పదార్థం శరీరంలో పెరిగి హృదయానికి సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీంతో తీవ్ర గుండె సమస్యలు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link