Vitamin B12: విటమిన్ బి12 లోపం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు.. ఈ లోపం ఎలా వస్తోంది?
ముఖ్యంగా ఈ విటమిన్ 12 లోపం వయస్సు పెరిగిన వారిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ లోపం కారణంగా చాలామంది ప్రాణాంతక వ్యాధుల బారిన కూడా పడుతున్నారని సీనియర్ వైద్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా అనారోగ్య సమస్యల బారిన పడడానికి ఇది కూడా ఒక కారణమేనని వారంటున్నారు.
శరీరంలో తగిన మోతాదులో పోషకాలు లేకపోవడం కారణంగా చాలామందిలో విటమిన్ బి12 లోపం వంటి సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న వయసులోనే ఈ సమస్యల బారిన పడుతున్నారు. కాబట్టి ఇలాంటి ఈ లోపం బారిన పడకుండా ఉండడానికి ప్రతిరోజు తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి.
ముఖ్యంగా ఈ విటమిన్ బి 12 లోపం రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. శాకాహారాలు తీసుకునే చాలామందిలో ఈ లోపం ఏర్పడుతోంది. దీంతోపాటు 60 ఏళ్లు నిండిన వారిలో కూడా ఈ లోపం వస్తోంది. అలాగే బరువు తగ్గడానికి చేయించుకున్న చికిత్స కారణంగా కూడా కొంతమందిలో ఈ లోపం వస్తోంది.
శరీరంలో తగిన మోతాదులో విటమిన్ b12 లేకపోవడం కారణంగా అనేక అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా చాలామందిలో బద్ధకం, అలసట మానసిక వ్యాధులు, నరాల సంబంధిత సమస్యలు వస్తున్నాయి.
ఈ విటమిన్ B12 లోపంతో బాధపడుతున్న వారు తప్పకుండా ప్రతిరోజు పాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు మాంసం, గుడ్లు, చేపలు తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఈ లోపం నుంచి ఉపశమనం పొందవచ్చు.