6 Vitamins: 40 ఏళ్లు దాటాక పటిష్టంగా యౌవనంగా ఉండాలంటే ఏయే విటమిన్లు అవసరం
విటమిన్ డి
విటమిన్ డి అనేది ఎముకలు బలంగా ఉండేందుకు చాలా అవసరం. కాల్షియం సంగ్రహణకు తోడ్పడుతుంది. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుంది. సూర్యరశ్మి ఇందుకు బెస్ట్ సోర్స్. ఆహార పదార్ధాలైతే చేపలు, గుడ్లు, పెరుగు వంటివి తీసుకోవాలి.
విటమిన్ సి
విటమిన్ సి అనేది ఇమ్యూనిటీని పటిష్టం చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిని యాంటీ ఆక్సిడెంట్ అని కూడా అంటారు. శరీరాన్ని మృత కణాల్నించి కాపాడుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఆరెంజ్, నిమ్మ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, బొప్పాయి, దానిమ్మ, ఉసిరిలో ఉంటుంది.
కాల్షియం
కాల్షియం ఎముకలు, పళ్లను పటిష్టంగా ఉంచేందుకు అవసరమౌతుంది. 40 ఏళ్లు దాటాక ఎముకలు బలహీనమౌతుంటాయి. కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, పెరుగు, పన్నీరు, ఆకు కూరలు, బాదం వంటివి తీసుకోవాలి
విటమిన్ బి12
విటమిన్ బి12 అనేది అవయవాల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు, ఎనీమియా నుంచి కాపాడేందుకు దోహదపడుతుంది. ఇది ఎక్కువంగా మాంసం, పన్నీరు, గుడ్లలో ఉంటుంది. అందుకే శాకాహారులకు విటమిన్ బి12 కొరత ఎక్కువగా ఉంటుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె వ్యాధులు దూరం చేసేందుకు, మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదెక్కువగా చేపలు, వాల్ నట్స్, చియా సీడ్స్ లో ఉంటుంది.
మెగ్నీషియం
మెగ్నీషియం ఎముకల్ని బలంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. కండరాలపై ఒత్తిడి లేకుండా చేస్తుంది. పాలకూర, బాదం, అరటి పండ్లు, సీడ్స్ లో ఎక్కువగా ఉంటుంది