VIVO Smartphone: తక్కువ ధర, అద్భుతమైన ఫీచర్లతో రహస్యంగా కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసిన వివో

Tue, 29 Nov 2022-4:29 pm,

Vivo Y02 ఆండ్రాయిడ్ 12 గో ఆధారంగా నడుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సిమ్, 4జి వోల్ట్, బ్లూటూత్ 5, జీపీఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మాత్రం లేదు. ఈ ఫోన్ బరువు కేవలం 186 గ్రాములు మాత్రమే.

Vivo Y02 ధర ఇండియాలో 7,760 రూపాయలు మాత్రమే. ఈ ఫోన్ ఆక్వా బ్లూ, క్లాసిక్ రంగుల్లో లభ్యం కానుంది. ఇతర ఆసియా దేశాల్లో కూడా లాంచ్ కానుంది.

Vivo Y02లో 6.5 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సిడి డిస్‌ ఉంటుంది. స్క్రీన్  720 x 1600 పిక్సెల్ హెచ్‌డి ప్రస్ రిజల్యూషన్‌తో ఉంటుంది. ఈ ఫోన్ ఆక్టా కోర్ ప్రోసెసర్‌తో నడుస్తుంది. ఇందులో 5మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉంది. ఇక 8 మెగాపిక్సెల్ కెమేరా, ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ ఉన్నాయి.

Vivo Y02లో హెలియో పి22 చిప్‌తో నడుస్తుందని తెలుస్తోంది. 

Vivo Y02లో 2 జీబీ, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఉంటాయి. స్టోరేజ్ మాత్రం మైక్రో ఎస్డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ మరో ప్రత్యేకత. ఇందులో 10 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link