Vivo X100 Pro Price: Vivo నుంచి గుడ్‌ న్యూస్‌..ప్రీమియం ఫీచర్స్‌తో మరో 2 మొబైల్స్‌..ధర, విడుదల తేది వివరాలు!

Thu, 28 Dec 2023-8:54 am,

Vivo నుంచి విడుదల కాబోయే మొబైల్స్‌ X100 సిరీస్‌లో విడుదల కాబోతున్నాయి. కంపెనీ ఈ స్మార్ట్‌ ఫోన్స్‌కి సంబంధించిన విడుదల తేదిని ఇటీవలే ప్రకటించింది. అధికారిక వివరాల ప్రకారం ఈ Vivo X100 మొబైల్స్‌ జనవరి 4న మార్కెట్‌లోకి లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది.  

ఈ రెండు స్మార్ట్ ఫోన్స్‌ ఆస్టరాయిడ్ బ్లాక్, స్టార్‌ట్రైల్ బ్లూ, సన్‌సెట్ కలర్‌ ఆప్షన్స్‌లో విడుదల కాబోతోంది. ఈ మొబైల్స్‌ MediaTek Dimensity 9300 ప్రాసెసర్‌పై పని చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్స్‌కి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  

ఈ Vivo X100, Vivo X100 Pro స్మార్ట్‌ ఫోన్స్‌ ఎంతో శక్తివంతమైన Funtouch OS 14పై రన్‌ కాబోతున్నాయి. ఇక ఈ మొబైల్స్‌  6.78 అంగుళాల 8 LTPO AMOLED డిస్ల్పేను కలిగి ఉంటాయి. ఈ డిస్ల్పే 120Hz రిఫ్రెష్ రేట్‌తో రాబోతోంది.    

ఈ రెండు స్మార్ట్‌ ఫోన్స్‌ Zeiss-బ్రాండెడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. ఈ కెమెరాలు ఎంతో శక్తివంతంగా ఉంటాయని ప్రముఖ టిప్‌స్టర్స్‌ తెలిపారు. ఈ మొబైల్‌ మార్కెట్‌లోకి విడుదలైతే యాపిల్ 15తో పోటీ పడే ఛాన్స్‌ ఉంది. 

వీవో ఇప్పటికే ఈ రెండు స్మార్ట్‌ ఫోన్స్‌ను చైనాలో విడుదల చేసిన సంగతి తెలిసిందే..ప్రస్తుతం మొబైల్‌ చైనా మార్కెట్‌లో  CNY 4,999తో అందుబాటులో ఉంది. భారత్‌లో ఈ మొబైల్‌ రూ. 56,500లోపే లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  

ఇక హై ఎండ్‌  Vivo X100 సీరిస్‌ మొబైల్‌ ధర విషయానికొస్తే..చైనా మార్కెట్‌లో రూ. 60 వేలలోపే లభిస్తోందని తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్స్‌ భారత మార్కెట్‌లో విడుదలై చైనా మార్కెట్‌లో ఉండే ధర కంటే పెరిగే అవకాశాలు ఉన్నాయి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link