VI Netflix Plans: ఈ రెండు వోడాఫోన్ ఐడియా ప్లాన్స్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్ ఉచితం

Sat, 01 Jun 2024-12:01 pm,

ఈ రెండు ప్లాన్స్ కాకుండా వోడాఫోన్ ఐడియా ప్లాన్స్ ఇంకా ఉన్నాయి. వోడాఫోన్ ఐడియాలో అత్యంత తక్కువ ప్లాన్ 99 రూపాయలకు ఉంది. 

వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్స్ బింజ్ ఆల్ నైట్ ఆఫర్‌తో పాటు వస్తోంది. ఇందులో రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో వీకెండ్ డేటా రోల్ ఓవర్ వెసులుబాటు ఉంటుంది.

1399 రూపాయల ప్లాన్‌లో వ్యాలిడిటీ సమయం 84 రోజులు. రోజుకు 2.5 జీబీ డేటా అందుతుంది. ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా వీక్షించవచ్చు.

వోడాఫోన్ ఐడియా అందిస్తున్న 998 రూపాయల ప్లాన్ వ్యాలిడిటీ 70 రోజులుంటుంది. మొత్తం 106 జీబీ డేటా లభిస్తుంది. అంటే రోజుకు 1.5 జీబీ డేటా.  ఇతర ప్లాన్స్‌లో ఉన్నట్టే రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. 

వోడాఫోన్ ఐడియా అందిస్తున్న ఈ రెండు ప్లాన్స్ 998 రూపాయలు, 1399 రూపాయలుగా ఉంది. రెండింటికీ నెట్‌ఫ్లిక్స్ ఫ్రీగా అందుతుంది

దేశంలోని టెలీకం కంపెనీల్లో మూడో స్థానంలో ఉన్న వోడాఫోన్ ఐడియా తాజాగా రెండు ప్లాన్స్ ప్రారంభించింది. ఇందులో యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా లభిస్తుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link