VI Independence Day Offer: వోడాఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్, ఈ ప్లాన్స్‌తో అమెజాన్, హాట్‌స్టార్ ఉచితం
VI 3699 Plan Offer
ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. ఇందులో కూడా రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. ఇండిపెండెన్స్ డే ఆఫర్‌లో భాగంగా అదనంగా 50 జీబీ డేటా 90 రోజులు లభిస్తుంది. ఇందులో ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ప్లాన్ ఉచితంగా లభిస్తుంది.
VI 3624 Plan offer
ఇది కూడా వార్షిక ప్లాన్. 365 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ సౌకర్యం ఉంటుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. ఇండిపెండెన్స్ డే ఆఫర్‌లో భాగంగా అదనంగా 50 జీబీ డేటా 90 రోజులు లభిస్తుంది. అంతేకాకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఏడాదిపాటు ఉచితం.
VI 3499 Prepaid plan offer
ఇది వార్షిక ప్లాన్. 365 రోజులు వర్తిస్తుంది. ఇందులో కూడా రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 10 ఎస్ఎంఎస్ సౌకర్యం ఉంటుంది. ఇండిపెండెన్స్ డే ఆఫర్‌లో భాగంగా 50 జీబీ డేటా 90 రోజుల వరకు అదనంగా లభిస్తుంది.
VI 1749 Prepaid Plan offer
ఇది లాంగ్ టర్మ్ ప్లాన్. 180 రోజుల కాల వ్యవధితో వస్తుంది. రోజుకు 1.5 జీబీ డేటా ఉంటుంది అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా అదనంగా 30 జీబీ డేటా 45 రోజులపాటు లభిస్తుంది.