Voter List: SMS ద్వారా ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి!
సులభంగా ఎలాంటి ఖర్చు లేకుండా మీ సేవాకు వెళ్లకుండానే ఓటింగ్ లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఓటింగ్ లిస్ట్‌లో మీ పేరు ఉంటే ఓటు వేసే హక్కును కలిగి ఉంటారు. అయితే ఈ సంవత్సరమే అప్లే చేసుకున్న వారు తప్పకుండా ఓటింగ్ లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాల్సి ఉంటుంది.
SMS ద్వారా ఓటరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి ముందుగా ఒక మొబైల్‌ను తీసుకుని ఇలా మేము అందించిన వివరాల ప్రకారం ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
మీ ఓటర్ ID కార్డు సంబంధించిన పూర్తి వివరాలు, ఓటింగ్ లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి ఫోన్ నుంచి టెక్స్ట్ సందేశాన్ని పంచాల్సి ఉంటుంది.
దీని కోసం ముందుగా ఫోన్‌లో సాధారణ మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసి మెసేజ్‌లో EPIC అని వ్రాసి, దీంతో పాటు మీ ఓటర్ ID కార్డ్ కూడా టైప్ చేయాల్సి ఉంటుంది.
ఇలా రాసిన సందేశాన్ని 9211728082 లేదా 1950కి నంబర్లకు మెసేజ్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మీకు ఒక సందేశం వస్తుంది.
ఇలా మెసేజ్ చేసిన తర్వాత మీ నంబర్‌కు ఎన్నికల కమీషన్ నుంచి సందేశం వస్తుంది. అందులో మీ పోలింగ్ నంబర్‌తో పాటు మీ పూర్తి పేరు, ఇతర వివరాలు ఉంటాయి.