FD Interest Rates: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలనుకుంటున్నారా? ఈ బ్యాంకు ఎక్కువ వడ్డీ ఇస్తుంది త్వరపడండి..

Wed, 29 May 2024-9:48 am,

యాక్సిస్ బ్యాంకు ఎక్కువగా వడ్డీ రేట్లు ఖాతాదారులకు అందిస్తోంది. ఇది 7.20% సంవత్సరానికి అందజేస్తుంది 18 నెలల వరకు ఫిక్స్ డిపాజిట్ చేసుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఏడాదికి మీ డబ్బు ఫిక్స్ డిపాజిట్ చేస్తే 6.70 శాతం, రెండు సంవత్సరాలకు 7.10 శాతం, ఐదు సంవత్సరాలకు 7 శాతం వడ్డీని ఖాతాదారులకు అందిస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అతిపెద్ద బ్యాంకు ఇది ఎక్కువ శాతం వడ్డీని అందిస్తుంది. 7.25% వరకు 18 నెలల నుంచి 21 నెలల లోపు వడ్డీ ఫిక్స్ డిపాజిట్ చేసిన ఖాతాదారులకు ఇది వర్తిస్తుంది. ఏడాదికి 6.60% మూడేళ్లకు ఐదేళ్లకు 7శాతం వడ్డీని ఖాతాదారులకు అందిస్తుంది.  

ఐసిఐసిఐ బ్యాంకు కూడా ఎక్కువ మొత్తంలో వడ్డీని అందజేస్తుంది. 15 నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు 7.20% వడ్డీని ఇస్తుంది. ఇక ఏడాదికి గాను 6.75 శాతం, మూడేళ్లు, ఐదేళ్లగాను 7 శాతం వడ్డీని ఖాతాదారులకు ఫిక్స్ డిపాజిట్ పై అందిస్తుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా లో కూడా ఎక్కువ మొత్తంలో వడ్డీని అందిస్తుంది. రెండు, మూడేళ్లకు 7.25% అందజేయగా ఏడాది ఫిక్స్ డిపాజిట్ చేసిన ఖాతాదారులకు 6.85 శాతం వడ్డీ అందజేస్తుంది. మూడేళ్లు ఐదేళ్లకు ఫిక్స్ డిపాజిట్ చేస్తే 6.50, 7.25% వడ్డీని అందిస్తుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా 7.25% వడ్డీని అందిస్తుంది. ఇది 400 రోజుల ఫిక్స్ డిపాజిట్ పై వర్తిస్తుంది. ఒకవేళ మీరు ఏడాదికి ఫిక్స్ డిపాజిట్ చేయాలనుకుంటే 6.75 శాతం వడ్డీ లభిస్తుంది పంజాబ్ నేషనల్ బ్యాంకులో మూడేళ్లకు ఫిక్స్ డిపాజిట్ చేస్తే 6.50 శాతం, 5 ఏళ్ల వరకు ఫిక్స్ డిపాజిట్ చేస్తే మీరు మెచ్యూరిటీ పొందే వరకు 7 శాతం వడ్డీ అందిస్తారు.  

ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 400 రోజులకు అమృత్ కలశ్‌ స్కీమ్‌ కింద 7.10% వడ్డీని అందిస్తుంది. ఏడాదికి మీరు ఫిక్స్ డిపాజిట్ చేస్తే 6.8% వడ్డీ లభిస్తుంది. ఇక మూడేళ్లకు 6.50 శాతం, ఐదేళ్లకు 6.75% వడ్డీ లభిస్తుంది.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ శాతం వడ్డీని పొందుతారు. ఇక్కడ 444 రోజుల స్కీం కింద 7.30% వడ్డీని ఏడాదికి అందిస్తుంది. ఈ బ్యాంకులో మీరు సంవత్సరం పాటు డబ్బులు డిపాజిట్ చేయాలనుకుంటే 6.90 వడ్డీని అందిస్తుంది. మూడేళ్లకు ఐదేళ్లకు 6.50% వడ్డీ లభిస్తుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link