Aloe vera Gel: ఈ ఆకు రసం తెల్లజుట్టును 5 నిమిషాల్లో నల్లగా మారుస్తుంది.. సాయి పల్లవి హెయిర్ కేర్ రొటీన్‌లో ఇది తప్పనిసరట..

కలబంద మన అందరి ఇళ్లలో అందుబాటులో ఉంటుంది. దీంతో మీ జుట్టు నేచురల్‌గా నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాదు హిరోయిన్ సాయి పల్లవి జుట్టు అంత ఒత్తుగా, అందంగా కనిపించడానికి కూడా ప్రధాన కారణం ఇదే. ఇది ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

వైట్ హెయిర్‌ను వెంటనే బ్లాక్‌లోకి మారిపోవాలంటే మీరు కూడా ఈ చిట్కాను అనుసరించండి. దీనికి కావాల్సినవి ఒక చిన్న కప్పు కలబంద జెల్, రెండు టీస్పూన్ల కొబ్బరి నూనె, మెహందీ పొడి- రెండు టీస్పూన్లు తీసుకోండి.

ఈ పదార్థాలన్నింటినీ ఒక గిన్నెల్లోకి తీసుకుని బాగా కలపాలి. ఇది మంచి పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేయాలి.
ముఖ్యంగా ఈ మాస్క్ వేసుకునే ముందు జుట్టు నూనె లేకుండా బాగా కడగాలి. ఆ మరుసటి రోజు ఈ ప్యాక్ వేసుకుంటే బాగుంటుంది. జుట్టు బాగా ఆరిన తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల ఒత్తైన, నిగనిగలాడే నల్లని జుట్టు మీ సొంతం చేసుకుంటారు.
(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)