Water Disruption: హైదరాబాద్‌వాసులకు అలెర్ట్.. ఫిబ్రవరి 1వ తేదీ నీటి సరఫరా బంద్..

ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజీ బోర్డు తెలిపింది. 132 కెవి ఫీడర్ నర్సపల్లి సబ్స్టేషన్లో మరమ్మతుల నిర్వహిస్తున్నారు. ఇది కాకుండా తెలంగాణ ట్రాన్స్కో అధికారులు కూడా రిపేర్లు నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.

అంటే మొత్తంగా ఆరు గంటల పాటు ఈ నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది. కృష్ణ ఫేస్ 1, 2, 3 రిజర్వాయర్స్ నుంచి నీటి సరఫరా అయ్యే ప్రాంతాల్లో ఈ మంచినీటి సరఫరా అంతారాయం కలగనుంది. మీరాలం, శాస్త్రి పురం, సంతోష్ నగర్,

వినయ్ నగర్, సైదాబాద్, చంచల గూడా, ఆస్మానగర్, యాకుత్ పురా, మాదన్న పేట. మహబూబ్ మాన్షన్, భోజగుట్ట, షేక్పేట్, బొగ్గులకుంట, అఫ్జల్ గంజ్, అల్లా బండ, నారాయణ గూడ, అడిక్ మేట్, శివం రోడ్డు, చిలకలగూడ వంటి ప్రాంతాల్లో ఫిబ్రవరి ఒకటో తేదీన నీటి సరఫరా ఉండదు
ఇంక జూబ్లీహిల్స్, ఫిలింనగర్, ప్రశాంత్ నగర్, తార్నాక, లాలాపేట్, బౌద్ధ నగర్, మారేడుపల్లి రైల్వే, ఎంఈఎస్, కంటోన్మెంట్, ప్రకాష్ నగర్, పాటిగడ్డ, రియాసత్ నగర్, అలియాబాద్, బండ్లగూడ, హస్మత్ పెట్, ఫిరోజ్ గూడ, గౌతమ్ నగర్, సాహెబ్ నగర్, వైశాలి నగర్, అలకాపురి, బి.యన్.రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్ ప్రాంతాల్లో కూడా నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది
ఇది కాకుండా మహేంద్ర హిల్స్, రామంతపూర్ ,ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిలకానగర్, దేవేందర్ నగర్, గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, దుర్గా నగర్, బద్వేల్, గోల్డెన్ హైట్స్, హార్డ్‌వేర్ పార్క్, గంధం గూడెం, బోడుప్పల్, మల్లికార్జున నగర్, చెంగిచెర్ల, భరత్ నగర్, ఆనంద్ నగర్ క్రాస్ రోడ్స్, ఫిర్జాదిగూడ, మీర్ పేట్, కూర్మగుడా, లెనిన్ నగర్, బడంగ్పేట్ ప్రాంతాల్లో కూడా నీటి సరఫరా కి 6 గంటల పాటు అంతరాయం కలుగుతుంది