Wayanad Landslides Photos: వయనాడ్ విషాదం.. 47 కు చేరిన మృతుల సంఖ్య, ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీ తీవ్రదిగ్భ్రాంతి..

Tue, 30 Jul 2024-12:33 pm,

కేరళ వయనాడ్‌లో కొండచరియాలు విరిగిపడిన ఘటనలో కొన్ని వందల మంది నిరాశ్రయులయ్యారు. అంతేకాదు ఈ పెనువిషాదంలో ప్రాణాలు, భారీ ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. సహాయక చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి.   

ఈ ఉదయం వయనాడ్‌ మెప్పాడి కొండచరియల ఘటనల వల్ల ఎంతో మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. కొండచరియల కింద ఇరుక్కున్న వారిని ప్రాణాలతో బయటకు కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కేరళ సీఎం పినరాయి విజయన్‌ చెప్పారు.   

ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాయి. భారీగా వర్షాలు కురుస్తూ ఉండటంతో సహాయక చర్యలకు కూడా ఆటంకం ఏర్పడింది. సహాయక చర్యలు చేపట్టేందుకు రంగంలోకి మిగ్‌ విమానాలు కూడా అందుబాటులో ఉన్నాయి.  

అంతేకాదు ముఖ్యమంత్రి విజయన్‌ కేంద్ర మంత్రులతో మాట్లాడారు. వారి నుంచి సహాయం కూడా కోరారు దీనికి వారు ఏ సహాయం చేయడానికి అయినా వెంటనే తమను సంప్రదించాలని సూచించారు.  

ఇదిలా ఉండగా మెప్పాడి గ్రామలో అర్ధరాత్రి కొండచరియలు విరిగి పడటంతో గాఢనిద్రలోనే ఎంతో మంది ప్రాణాలను విడిచిపెట్టారు. ఈ దారుణ ఘటనలో ఎన్నో వందల మంది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. కొంతమంది తమ కుటుంబీకుల ఆచూకీ కోసం వెతుకుతున్నారు.  

వెంటనే స్పందించిన పీఎం మోడీ ట్వీట్టర్ వేదికగా మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. కేంద్ర తరఫున మృతులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.  

ఈ దుర్ఘటనలో చుర్మాల్ గ్రామంలోని వందలాది ఇళ్లు, వాహనాలు నీటమునిగిపోయాయి. కేరళ విపత్తు నిర్వహణ సంస్థ ఇప్పటికే సహాయక చర్యలు చేపడుతోంది.   

కేరళలోని వయనాడ్‌లో కొండచరియాలు విరిగి పడిన ఘటనలో భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు కూడా ఆటంకం ఏర్పడింది.  

అన్ని ప్రభుత్వ సంస్థలతో కలిపి పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. బాధితులను రక్షించేందుకు మిగ్-17 హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి.  

ముండకై బ్రిడ్జి కూలిపోవడంతో తాత్కాలిక వంతెన నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి...  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link