Heavy rains: రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వర్షం దంచికొడుతుంది. ఇప్పటికే ఉపరిత ద్రోణి ప్రభావం వల్ల కూడా వర్షం కురుస్తుంది. దీని వల్ల పలు ప్రాంతాలో బలమైన ఈదురు గాలులు సైతం వీస్తున్నాయి. వర్షాలు భారీగా కురుస్తుండటంతో జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఉపరితల ద్రోణికి తోడుగా బంగాళ ఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలియజేసింది.దీని ప్రభావం వల్ల కూడా తెలుగు రాష్ట్రాలలో కుండపోతగా వర్షం కురుస్తుంది.
ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాలలో అధికారులు స్కూళ్లకు సెలవులు ఇచ్చేశారు. అంతేకాకుండా.. అత్యవసమైతే తప్ప బైటకు రావోద్దని కూడా అలర్ట్ జారీ చేశారు. అదే విధంగా సముద్రాల్లో చెపలు పట్టేవారు అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లోద్దని కూడా వాతావరణ కేంద్రం అలర్ట్ ను జారీచేసింది.ఈ నేపథ్యంలో ఏపీలో అనేక జిల్లాలో ఇప్పటికే కొన్నిస్కూళ్లలో సెలవులు కూడా ప్రకటించారు.
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు తెగ ఇబ్బందులు పడుతున్నారు. ఏపీతో పాటు తెలంగాణలో కూడా వాతావరణ కేంద్రం రానున్న మూడు రోజుల పాటు వర్షంకురుస్తుందని అలర్ట్ ను జారీచేసింది. ఇప్పటికే తెలంగాణలోని అన్ని జిల్లాలలో వర్షం కురుస్తుంది. వర్షాలు కురుస్తుండటం వల్ల, రోడ్లన్నినీళ్లతో నిండిపోయాయి. అంతేకాకుండా.. ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి.
చాలా చోట్ల వర్షాల వల్ల.. తాగు నీళ్లన్ని కలుషితం అవుతున్నాయి. దీంతో చాలా మంది ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాకుండా..డెంగీ బారిన కూడా చాలా మంది పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల అధికారులు..కూడా వర్షాలపై అప్రమత్తమయ్యారు. ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపట్టారు. వర్షాకాలంలో అలర్ట్ గా ఉండాలని అత్యవసరమైతే తప్ప బైటకు రావొద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు హైదరాబాద్ లో కూడా..వర్షం వల్ల వల్ల జనాలు ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై ఆగిఉన్న నీళ్లను శుభ్రం చేస్తున్నారు. మ్యాన్ హోళ్ల వద్ద ఆగిఉన్న చెత్తను క్లీన్ చేస్తున్నారు. వర్షాకాలంలో నాలాలా వద్ద అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు.
ఐఎండీ అలర్ట్ నేపథ్యంల తెలుగు రాష్ట్రాల ప్రజలు అవసరమైతే తప్ప బైటకు రావొద్దని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో కరెంట్ పోల్ వద్ద, ఇతర ఎలక్ట్రిక్ తీగలను ముట్టుకొవద్దని కూడా హెచ్చరిస్తున్నారు. మూడు రోజుల పాటు జాగ్రత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు.