Weight Control Tips: నెలలో 5 కిలోలు బరువు తగ్గాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు
తగినంత నిద్ర
రోజూ తగినంత నిద్ర అవసరం. నిద్ర తక్కువ ఉండటం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ తప్పుతుంది. ఎప్పుడైతే నిద్ర తక్కువైందో తిండిపై కోరిక పెరుగుతుంది. అందుకే రాత్రి వేళ నిద్ర 7-8 గంటలు తప్పకుండా ఉండాలి.
నో షుగర్ నో ప్రోసెస్డ్ ఫుడ్
ప్యాకెట్ ఫుడ్స్, స్వీట్స్, షుగర్ కంటెంట్ డ్రింక్స్ వంటివాటికి దూరంగా ఉండాలి. వీటిలో పోషకాలు తక్కువ, కేలరీలు ఎక్కువ ఉంటాయి.
హైడ్రేట్
రోజంతా నీళ్లు తాగుతుండాలి. హెర్బల్ టీ వంటివి తాగడం మంచిది. దాహం వేసిన వేయకున్నా నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి.
రోజూ తగినంత వ్యాయామం
మీ రోజువారీ జీవితంలో తగినంత వ్యాయామం లేదా వాకింగ్ ఉండేట్టు చూసుకోవాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం లేదా వాకింగ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పెద్ద ఎత్తున కేలరీలు బర్న్ అవుతాయి.
బ్యాలెన్సింగ్ డైట్
అతిగా తినకుండా జాగ్రత్త పడాలి. దీనికోసం చిన్న చిన్న ప్లేట్లు, గిన్నెలు వినియోగించాలి. టీవీ, కంప్యూటర్ ముందు కూర్చుని లేదా మొబైల్ ఫోన్ చూస్తూ తినడం మానుకోవాలి.
పోషక ఆహారం
కేలరీలు పుష్కలంగాఉండే ఆహారాన్ని తగ్గిస్తూ..పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్, తృణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.