Weight Loss: తక్కువ ఖర్చుతో సింపుల్గా వంటింటిలోని ఈ దినుసుతో ఇలా బరువు తగ్గండి..
అధిక బరువు తగ్గించుకోవడానికి చాలా మంది మార్నింగ్ లేచి పరుగులు పెడుతున్నారు. మరికొందరు ఉదయం నడకతో ప్రారంభించి జిమ్లలో గంటల కొద్ది వ్యాయామాలు చేస్తుంటారు. కానీ వంటింటిలో వెల్లుల్లితో ఈజీగా బరువు తగ్గవచ్చు.
వరల్డ్ వైడ్గా చాలా మంది అధిక బరువుతో బాధపుడుతుంటారు. సన్నగా.. నాజూగ్గా ఉండటానికి నానా యాతనలు పడుతుంటారు. కొంత మంది తినే అన్నం మానేసి కేవలం పండ్ల రసాలు.. కూరగాయల రసం వంటివి తీసుకుంటారు.
మన దేశంలో ధన వంతుడి దగ్గర నుంచి పేదవాడికి అందరికీ అందుబాటులో ఉండేది వెల్లుల్లి (ఎల్లిపాయ). మన భారతీయులు వంటకాల్లో వెల్లుల్లిని ఎక్కువగా వాడుతుంటారు.
వెల్లుల్లిలో విటమిన్ C, విటమిన్ B6, ఫైబర్, కాల్షియం, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
లోబీపీ, జలుబుతో బాధపడేవారు వెల్లుల్లి తీసుకుంటే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. అంతేకాదు నడుము చుట్టు ఉండే కొవ్వును వెల్లుల్లి ఈజీగా తగ్గిస్తుంది.
రోజు రెండు లేదా మూడు వెల్లుల్లి రేకలను చిన్న ముక్కలుగా చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు వాటిని ఒక గ్లాసులో వేయాలి. ఆ నీళ్ల నుంచి వెల్లుల్లిని తీసివేసి అందులో నల్ల మిరియాల పొడివేసి కలిపి రోజు పరగడపున తాగితే.. బరువు తగ్గుతారు.
ఈ విషయాలను పాటించే ముందు డాక్టర్ల లేదా నిపుణుల సలహాలు తీసుకోవడం మరిచిపోకండి..