Weight Loss Spices: ఈ 5 మసాలాలు నిత్యం మీ డైట్లో ఉండాల్సిందే.. వాటి ఉపయోగాలు తెలిస్తే షాకే..

Sat, 06 Jul 2024-12:07 pm,

Weight Loss Spices: అతి బరువును తగ్గించుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకే ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. సమతూల ఆహారం మీ డైట్లో చేర్చుకుంటే వెయిట్‌ లాస్‌ అవుతారు. తరచూ ఎక్సర్‌సైజ్‌ చేస్తూ ఉంటే ఎక్ట్రా క్యాలరీలు బర్న్‌ అవుతాయి. బరువు ఈజీగా తగ్గుతారు. మన వంటగదిలోని ఈ 5 వస్తువులు మీడైట్లో ఉండాల్సిందే ఇవి ఫ్యాట్‌ బర్న్‌ చేసే మసాలాలు. ఇది బరువు నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు ఇది మెటబాలిజం రేటును పెంచుతుంది. జీర్ణక్రియను కూడా మెరుగుచేస్తుంది. ఈ సాంప్రదాయ మసాలాలు తింటే మీ బెల్లీ ఫ్యాట్‌ ఇట్టే తగ్గిపోతుందంటే నమ్మండి.. ఆ ఆహారాలు ఏవో తెలుసుకుందాం.  

పసుపు.. పసుపులో సహజసిద్ధమైన వెచ్చదనాన్ని ఇచ్చే గుణం కలిగి ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇది మెటబాలిజం రేటును కూడా పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించాలనుకునేవారు ఇన్సూలిన్‌ నిరోధకతను నివారించుకోవాలి. దీంతో బరువు కూడా తగ్గిపోతారు.  ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పసుపు తరచూ మన డైట్లో చేర్చుకోవడం వల్ల బరువు సులభంగా త్వరగా తగ్గిపోతారు. రాత్రి పడుకునే ముందు పసుపు పాలను తీసుకోవాలి. పసుపు పాలు మీ డైట్లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

దాల్చిన చెక్క.. దాల్చిన చెక్కలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దాల్చిన చెక్కతో బరువు ఈజీగా తగ్గిపోతారు. వెయిట్‌ లాస్‌ జర్నీలో ఉన్నవారు దాల్చిన చెక్కను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది బాడీ మెటబాలిజం రేటును కూడా పెంచేస్తుంది.

వెల్లుల్లి.. వెల్లుల్లి కూడా నిత్యం మన వంటగదిలో అందుబాటులో ఉంటుంది.  ముఖ్యంగా ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.  ఇది బాడీ మెటబాలిజం రేటును కూడా పెంచుతుంది. అంతేకాదు వెల్లుల్లి తీసుకోవడం వల్ల కడుపు ఎక్కువ సమయంపాటు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో అతిగా తినరు.. బరువు పెరగరు..  

మిరియాలు.. మిరియాలు రుచికి మాత్రమే కాదు బరువు తగ్గించడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మిరియాల్లో పెప్పరైన్ ఉంటుంది. ఇది కూడా మెటబాలిజం రేటును పెంచుతుంది. బెల్లిఫ్యాట్‌ను తగ్గిస్తుంది కూడా.

అల్లం.. అల్లంతో కూడా బరువు సులభంగా తగ్గిపోతారు. అల్లంలో షుగర్‌ కంట్రోల్ చేసే గుణం ఉంటుంది. అల్లం మనం వంటల్లో ఉపయోగించుకోవచ్చు. సూప్స్, సలాడ్స్‌, కూరలు, పప్పు, టీ లలో ఉపయోగించవచ్చు. ఇవన్నీ భారతీయ సాంప్రదాయంలో మనం నిత్యం వినియోగంచే మసాలాలు, వీటిని తింటూనే బెల్లీ ఫ్యాట్‌ ను కూడా బర్న్‌ చేసుకోవచ్చు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link