Weight Loss Plans: వ్యాయామం, డైటింగ్ లేకుండానే బరువు తగ్గించవచ్చు ఇలా
షుగర్ అండ్ ప్రోసెస్డ్ ఫుడ్స్‌కు దూరం
ప్యాకెట్ జ్యూస్, ప్యాకెట్ ఫుడ్స్, చాకోలేట్స్, కేక్ వంటివాటిలో కచ్చితంగా షుగర్ కంటెంట్‌తో పాటు అన్‌హెల్తీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఈ వస్తువులు మీ బరువును పెంచడమే కాకుండా అనారోగ్య సమస్యలకు కారణమౌతాయి. అందుకే మీ డైట్ నుంచి వీటిని దూరం చేయాలి. వీటి స్థానంలో తాజా పండ్లు, కూరగాయలు చేర్చాలి
నీళ్లు ఎక్కువగా తాగడం
రోజంతా వీలైనంత ఎక్కువ నీళ్లు తాగాలి. నీరు మీ శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా మెటబోలిజంను వేగవంతం చేస్తుంది. బరువు తగ్గించేందుకు దోహదపడుతుంది.
తగినంత నిద్ర
మంచి నిద్ర ఆరోగ్యానికే కాదు బరువు తగ్గించేందుకు కూడా దోహదం చేస్తుంది. ఆకలి పెరగకుండా చేస్తుంది. అందుకే రోజూ రాత్రి వేళ 7-8 గంటల నిద్ర తప్పకుండా ఉండాలి.
ప్రోటీన్ రిచ్ ఫుడ్స్
ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేట్టు చేస్తాయి. దాంతో సహజంగానే మీ తిండి తగ్గుతుంది. తినే ఆహారంలో ప్రోటీన్ ఫుడ్స్ ఉండేట్టు చూసుకోండి. పప్పులు, గుడ్లు, చికెన్, చేపలు, సోయాబీన్ వంటివి.
తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు తినడం
రోజంతా తక్కువ తిని సాయంత్రమో రాత్రో ఒకేసారి ఎక్కువ తినడం మంచి పద్ధతి కాదు. ఇలా చేయడం వల్ల శరీరానికి ఒకేసారి అధిక మొత్తంలో కేలరీలు అందుతాయి. అందుకే తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు తినడం మంచిది. దీనివల్ల కేలరీలు బర్న్ అయ్యేందుకు వీలవుతుంది.