Weight loss Diet: రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తీసుకుంటే బరువు తగ్గడం ఖాయం
పెసరట్టు
పెసరట్టు బరువు తగ్గించేందుకు మంచి బ్రేక్‌ఫాస్ట్. పెసరట్లు తింటే చాలాసేపటి వరకూ ఆకలేయదు. ఇందులో ఫైబర్, ప్రోటీన్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి.
పోహా
బరువు తగ్గేందుకు ఉపయోగపడే బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ పదార్ధాల్లో పోహా ఒకటి. రోజూ పోహా తీసుకోవడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్టుంటుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీ రోజూ తీసుకుంటే చాలా మంచిది. టీ, కాఫీ స్థానంలో గ్రీన్ టి అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి అత్యంత లాభదాయకం. బరువు నియంత్రణలో ఉంటుంది.
ఓట్స్
ఓట్స్ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా మంచి ప్రత్యామ్నాయం. శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచుతుంది. మీ బాడీ ఫిగర్ కాపాడుతుంది. రోజూ ఓట్స్ తినే అలవాటుంటే బరువు పెరగడం జరగదు.
గుడ్లు
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ రూపంలో శరీరాన్ని ఫిట్‌గా ఉంచే పదార్ధాలుండాలి. దీనికోసం రోజూ ఉదయం గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. బరువు కూడా తగ్గుతారు.