Weight loss: ఆ విషయంలో పురుషుల కంటే స్త్రీలు చాలా స్లో.. అసలు విషయం తెలుస్తే షాకవ్వాల్సిందే
How to lose weight: బరువు తగ్గడం అంత ఈజీగా కాదు గురు. బరువు పెరగడం కూడా అంత సులభం కాదు. కానీ శరీరాన్ని మన ఆధీనంలో ఉంచుకోడం సులభమే. అవును ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే బరువును అదుపులో ఉంచుకోవచ్చు. అయితే బరువు తగ్గడం చాలా కష్టమైందే. దీనికి కఠిన శారీరక శ్రమ కూడా అవసరం.
బరువు తగ్గాలనుకునేవారు డైట్ ప్లాన్ రూపొందించుకోవాలి. అతిగా తినకుండా జాగ్రత్త పడాలి. అయితే కొందరు ఎంత కష్టపడినా బరువు మాత్రం తగ్గరు. ఎప్పటిలాగే ఉంటుంది. ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఒత్తిడికి గురవుతుంటారు. ముఖ్యంగా ఇలాంటి సమస్యను స్త్రీలు ఎక్కువగా ఎదుర్కుంటారు. పురుషులతో పోలిస్తే మహిళలు బరువు తగ్గడం చాలా కష్టమని అనేక పరిశోధనలు వెల్లడించాయి. కారణం ఏంటో ఇప్పుడు చూద్దం.
తక్కువ జీవక్రియ: పురుషులతో పోల్చితే స్త్రీలలో మెటబాలిజం తక్కువగా ఉంటుంది. పురుషుల జీవక్రియ రేటు కూడా అమ్మాయిల కంటే తక్కువగా ఉంటంది. మహిళలు సహజంగా తమ కేలరీలను బర్న్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. దీంతో త్వరగా బరువు తగ్గలేకపోతారు. ఒక్కోసారి ఇద్దరు వ్యక్తుల ఆహారంలో తేడా వల్ల కూడా ఇలా జరుగుతుంది.
శరీరంలో కొవ్వు పేరుకపోవడం: బరువు తగ్గడంలో సమస్యలకు ఇది కూడా ప్రధాన కారణం. ఎందుకంటే మహిళల శరీరంలో ఎక్కువ కొవ్వు ఉంటుంది. అబ్బాయిల పొట్ట, తొడలు, తుంటి దగ్గర కొవ్వు ఉంటుంది. కానీ స్త్రీల నడుము, మెడ, నడుము మీద కూడా కొవ్వు ఉంటుంది. పరిశోధనల ప్రకారం.. మహిళల్లో బరువు పెరగడం కంటే కొవ్వు ఎక్కువగా పెరుగుతుంది. కొవ్వు కరిగించేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది.
టెస్టోస్టెరాన్ స్థాయిలో తేడా: పురుషులు, స్త్రీలలో బరువు తగ్గడానికి ఒక కారణం టెస్టోస్టెరాన్ స్థాయిలలో వ్యత్యాసం కూడా ఒక కారణం. పురుషుల టెస్టోస్టెరాన్ స్థాయిలు స్త్రీల వలె త్వరగా బరువు తగ్గడానికి వీలుండదు. కానీ స్త్రీలలో టెస్టోస్టెరాన్ స్థాయి పురుషుల కంటే చాలా తక్కువగా ఉంటుంది. దీని కారణంగా వారు కష్టపడి పనిచేసినప్పటికీ సులభంగా బరువు తగ్గలేరు.
ఇతర కారణాలు: మహిళలు త్వరగా బరువు తగ్గకపోవడానికి హార్మోన్ల అసమతుల్యత కూడా కారణంగా చెప్పవచ్చు.కొంతమంది స్త్రీలకు అధిక వ్యాయామం వల్ల ఆకలి సమస్య పెరుగుతుంది. దీంతో అతిగా తినడం వల్ల బరువు పెరుగుతారు.ముఖ్యంగా చాలా మంది మహిళలు రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. దీంతోపాటు నిద్ర లేకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గడానికి చిట్కాలు: ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఇలా వ్యాయామం చేస్తే శారీరకంగా చురుకుగా ఉంటారు. ముఖ్యంగా 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి. జంక్ ఫుడ్ జోలికి అస్సలు పోకండి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే బరువు తగ్గేందుకు ఈజీగా ఉంటుంది. పాలతో తయారు చేసిన టీ తాగడం కంటే గ్రీన్ టీ కానీ, హెర్బల్ టీ కానీ తాగడం అలవాటు చేసుకోండి.