Weight Loss with Butter milk: బరువు తగ్గాలని చాలా కఠిన ప్రయత్నాలు చేస్తున్నారా? మజ్జిగలో ఈ ఒక్కవస్తువు కలిపి తాగి చూడండి..
మజ్జిగను పెరుగుతో తయారు చేసుకుంటారు. ఎండకాలం మనకు కడుపు సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతాయి.. అయితే, ఈ మండు వేసవిలో వడదెబ్బ సమస్య రాకుండా మజ్జిగ నివారిస్తుంది. ఇంటికి బంధువులు వచ్చినా వారికి చల్లని మజ్జిగను అందించే సంప్రదాయం తరతరాలుగా ఉంది. అయితే, ఈ మజ్జిగను వెన్న తీసి కూడా తయారు చేస్తారు. ఇది మన పేగు ఆరోగ్యానికి మంచిది.
అయితే, ఈ మజ్జిగను డైట్లో చేర్చుకుంటే బరువు కూడా ఈజీగా తగ్గిపోతారు అంటే మీరు నమ్ముతారా? అవును ఇందులో వెన్న తీసేస్తారు ఏ క్రీమ్ కూడా ఉండదు. దీన్ని మనం నీళ్లు పోసుకుని కావాల్సినంత పలుచగా తయారు చేసుకుంటారు. మజ్జిగ కడుపును చల్లబరుస్తుంది. పేగు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
ఎండకాలం మజ్జిగను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల కడుపులో మంచి బ్యాక్టిరియా కూడా పెరుగుతుంది. దీంతో పేగు కదలికలకు కూడా సహాయపడుతుంది. మజ్జిగ మంచి ప్రొబయోటిక్ కాబట్టి ఇందులో క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన ఎముకలకు ప్రోత్సహిస్తుంది. 100 మిల్లీ లీటర్ల మజ్జిగలో 40 క్యాలరీలు ఇవి శక్తిని అందిస్తాయి.
మజ్జిగను డైట్లో చేర్చుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో మజ్జిగను ప్రతిరోజూ తాగితే మన శరీరానికి తగినంత నీరు కావాల్సినంత శక్తిని అందిస్తుంది. అయితే, ఈ మజ్జిగ నీటిలో మెంతులను కలుపుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ సులభంగా తగ్గిపోతుందట. మెంతులతో కూడా బరువు ఈజీగా తగ్గిపోతారు. దీంతో మన చర్మం, జుట్టు ఆరోగ్యకరంగా మారడమే కాకుండా బరువు కూడా సులభంగా తగ్గుతారు.
మజ్జిగను తయారు చేసుకుని అందులో మెంతి గింజలను సన్నని పొడిలా తయారు చేసుకుని వేసుకోవాలి. ఓ గ్లాసు నీటిలో ఒక చెంచా మెంతి పొడిని వేసుకుని బాగా కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల అతితక్కువ సమయంలో బరువు తగ్గిపోతారు. దీంతో బెల్లీ ఫ్యాట్ సులభంగా కరిగిపోతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )