Google Search: గూగుల్‌లో అమ్మాయిలు ఎక్కువగా దేని గురించి సెర్చ్ చేస్తుంటారు
సాధారణంగా అందరికీ సంగీతం ఇష్టముంటుంది. కానీ అమ్మాయిలు ఎక్కువగా సెర్చ్ చేసేవాటిలో సంగీతం ఒకటి. రొమాంటిక్ పాటల్ని అమ్మాయిలు ఎక్కువగా సెర్చ్ చేస్తుంటారు. రొమాంటిక్ కవితలు కూడా ఎక్కువగా సెర్చ్ చేస్తుంటారు.
అమ్మాయిలకు గోరింటాకు ఎక్కువగా ఇష్టముంటుంది. ఈ సెర్చ్ రిపోర్ట్‌లో ఇదే విషయం వెల్లడైంది. గూగుల్‌లో ఎక్కువగా గోరింటాకు డిజైన్ల గురించి వెతుకుతుంటారు.
అమ్మాయిలు ఎప్పుడూ అందంగా ఉండటం, అందరి కంటే విభిన్నంగా ఉండటాన్ని ఇష్టపడుతారు. దీనికోసం ఇంటర్నెట్‌పై ఆధారపడతారు. అమ్మాయిలు ఎక్కువగా ఫ్యాషన్, ట్రెండ్స్, బ్యూటీ ట్రీట్‌మెంట్స్, ఇంటింటి చిట్కాల గురించి సెర్చ్ చేస్తుంటారు.
ఇవి కాకుండా ఎక్కువగా అమ్మాయిలు..ఆన్ లైన్ షాపింగ్ సైట్స్ ఓపెన్ చేస్తుంటారు. బట్టల డిజైన్లు, కొత్త కలెక్షన్లు, ఆఫర్ల గురించి తెలుసుకుంటుంటారు.
గూగుల్ సెర్చ్ రిపోర్ట్ ప్రకారం, అమ్మాయిలు బాల్యం నుంచే అభిరుచి కలిగి ఉంటారు. తమ కెరీర్‌పై ఎక్కువ దృష్టి కలిగి ఉంటారు. ఇటువంటి మహిళలు ఇంటర్నెట్‌పై కూడా ఆ విషయాల్నే సెర్చ్ చేస్తుంటారు. ఏ కెరీర్ ఎంచుకోవాలి, ఏ కోర్స్ తీసుకోవాలనేది సెర్చ్ చేసి తెలుసుకుంటారు.