Palmistry: మీ అరచేతిలో త్రిభుజం గుర్తు ఉందా? మీరు ఎంత అదృష్టవంతులు తెలుసా?
హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం అరచేతిలో గీతలు వివిధ రకాల అర్థాలను ఇస్తాయి. మన అరచేతిలో త్రిభుజం, ఎక్స్ మార్కులు కనిపిస్తాయి. అయితే వాటికి ఓ అర్థం ఉంటుంది.
మీ అరచేతిలో త్రిభుజం గుర్తు ఉంటే మీలో నాయకత్వ లక్షణాలు ఉంటాయని అర్థం. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. అనుకున్న లక్ష్యాలను సైతం ఛేదిస్తారు.
మీరు కోరుకున్న భాగస్వామిని పొందుతారు. మంచి వాగ్ధాటి కలిగి ఉంటారు. మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. ఎన్నో నైతిక విలువలు కూడా వీరు కలిగి ఉంటారు.
హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం ఇలా అరచేతిలో త్రిభుజ ఆకారం గుర్తు ఉంటే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అంతేకాదు పని ప్రదేశంలో కూడా ఎప్పుడూ సుపీరియర్ల అభినందనలు కూడా మీరు పొందుతారు.
వీళ్లు చదువులో కూడా మంచి ప్రతిభావంతులు. ఆ విధంగా వారు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. హస్త సాముద్రిక శాస్త్రంలో త్రిభుజ ఆకారం గుర్తు ఉన్న వ్యక్తి అదృష్టవంతుడు అవుతారని చెబుతుంది.