Vitamin C Rich Foods: విటమిన్ సి లోపముంటే ఏమౌతుంది, 5 బెస్ట్ ఫ్రూట్స్ ఇవే
పైనాపిల్
పైనాపిల్ల విటమిన్ సికు బెస్ట్ సోర్ట్ అని చెప్పాలి. ఇందులో డైజెస్టివ్ ఎంజైమ్స్ పెద్దఎత్తున ఉంటాయి. ఇమ్యూనిటీ పెంచేందుకు దోహదం చేస్తాయి. ఇందులో విటమిన్ సితో పాటు విటమిన్ బి6, పొటాషియం, కాపర్, థయామిన్ వంటి పోషకాలుంటాయి. ఒక కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకుంటే అందులో 79 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది.
బొప్పాయి
బొప్పాయిలో పొషక పదార్ధాలు చాలా చాలా ఎక్కువ. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వివిధ రకాల వ్యాధుల్ని దూరం చేస్తుంది. ఒక కప్పు బొప్పాయి ముక్కలు తింటే 88 మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది.
కివీ
కివీ అద్భుతమైన పౌష్ఠిక గుణాలు కలిగిన ఫ్రూట్. ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది. 2 కివీ ఫ్రూట్స్ తీసుకుంటే అందులో 137 మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 137 మిల్లీగ్రాములంటే రోజువారీ అవసరం కంటే ఎక్కువే
జామ
జామ అద్భుతమైన రుచికరమైన ఫ్రూట్. ఇందులో చాలా పోషకాలుంటాయి. ముఖ్యంగా విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఒక జాంకాయ తీసుకుంటే అందురే 125 మిల్లీ గ్రాముల విటమిన్ సి లభిస్తుంది. ఇమ్యూనిటీ పెంచుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి
షిమ్లా మిర్చి
షిమ్లా మిర్చి దాదాపు ప్రతి ఇంట్లో వాడుతుంటారు. వివిధ రకాల వంటల్లో ఇది తప్పకుండా యాడ్ చేస్తుంటారు. ఒక మీడియం సైజ్ షిమ్లా మిర్చి తీసుకుంటే అందులే 152 మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది. ఫలితంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.