Coriander Water Remedies: రోజూ ధనియా నీళ్లు తాగితే కొరియన్ల స్కిన్ టోన్ మీ సొంతం
ధనియా నీళ్లు ఎలా చేసుకోవాలి
ఇది చాలా సులభం. ధనియా గింజలను రాత్రి ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టి ఉదయం పరగడుపున వడగట్టి తాగేయాలి
బ్లడ్ ప్రెషర్ నియంత్రణ
ధనియా నీళ్లలో పొటాషియం ఇతర పోషకాలు చాలా ఉంటాయి. దాంతో బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో అద్భుతంగా ఉపయోగపడతాయి. రక్తపోటు సమస్య ఉన్నవాళ్లు రోజూ క్రమం తప్పకుండా ధనియా నీళ్లు తాగాలి
పీరియడ్స్ అండ్ బ్లడ్ షుగర్ నియంత్రణలో
పీరియడ్స్ సమయంలో మహిళలు ఎదుర్కొనే నొప్పి నుంచి ధనియా నీళ్లు ఉపశమనం కల్గిస్తాయి. అటు బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు సైతం ఉపయోగపడతాయి. రోజూ పరగడుపున తాగాల్సి వస్తుంది.
థైరాయిడ్‌కు చెక్
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నవాళ్లు ఉదయం ధనియా నీళ్లను తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ధనియా గింజలు, ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి థైరాయిడ్ సమస్యను నియంత్రిస్తాయి.
బరువు నియంత్రణలో
ధనియాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దాంతో బరువు నియంత్రణలో ఉపయోగపడుతుంది. ధనియా నీళ్లలో ఉండే యంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ల కారణంగా బరువు అదుపులో ఉంటుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల కడుపు స్వెల్లింగ్ సమస్య తలెత్తదు
చర్మ సంరక్షణ
ఇందులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తాయి. రోజూ క్రమం తప్పకుండా తీసుకోవాలి. చర్మం ఆరోగ్యంగా, నిగనిగలాడుతుంటుంది. చర్మం రంగులో కూడా మార్పు రావచ్చు. పింపుల్స్ సమస్య తొలగిపోతుంది.
జీర్ణక్రియ మెరుగుదల
ఇక్కడ మేం చెప్పబోయేది కిచెన్‌లో లభించే ధనియాల గురించి. ధనియా నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో చర్మానికి చాలా మంచిది. రోజూ పరగడుపున తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మెటబోలిజం వేగవంతమవుతుంది. బ్లోటింగ్ సమస్య తలెత్తదు.