Watermelon In Diabetes: మధుమేహం ఉన్నవారు పచ్చకాయను తినవచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారు?
ఇందులో దాదాపు 90 శాతం వరకు నీరు ఉంటుంది. అందుకు వైద్యులు కూడా ఎండకాలం పుచ్చకాయను మన ఆరోగ్యంలో చేర్చుకోమని సలహా ఇస్తారు. అయితే,మధుమేహంతో బాధపడేవారు పుచ్చకాయను తినవచ్చా? దీనికి వైద్యులు ఏం సూచిస్తున్నారు? తెలుసుకుందాం.
పుచ్చకాయలో లైకోపీన్ ఉంటుంది. ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అందేకాదు ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. హైబీపీతో బాధపడేవారు పుచ్చకాయను తమ డైట్లో చేర్చుకోవాలి. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలున్నవారు పుచ్చకాయను తినాలి.
పుచ్చకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ల గుణం కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ సీ కూడా పుష్కలంగా ఉంటుంది. అందుకే చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా పేగు ఆరోగ్యం బాగుంటుంది.
పుచ్చకాయలో ఉండే అమైనో యాసిడ్స్, సిట్రులిన్ కండరాల వాపును తగ్గిస్తుంది. ఇది కండరాల తిమ్మిరి, వాపును తగ్గించడంలో ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ ఎక్సర్‌సైజ్ చేసేవారు పుచ్చకాయతో తయారు చేసిన జ్యూస్ తాగుతారు.
అయితే, డయాబెటిస్ తో బాధపడేవారు పుచ్చకాయ తినవచ్చా? ఈ పండు రుచి తీయ్యగా ఉంటుంది. కానీ, డయాబెటిస్ తో బాధపడేవారు పుచ్చకాయ తినవచ్చు. ఇందులో గ్లైసెమిక్ సూచి తక్కువ, తక్కువ శాతంలో కార్బొహైడ్రేట్లు ఉంటాయి. అయితే, పుచ్చకాయను తిన్న తర్వాత ఓసారి షుగర్ టెస్ట్ చేసుకోవాలి.