Moong Sprouts: పెసర మొలకలు తింటున్నారా?అయితే ఇది మీకోసమే..?
మొలకెత్తిన పెసర గింజలు తినడం వల్ల ప్రోటీన్ అధికంగా లభిస్తుంది. ముఖ్యంగా మీరు శాఖాహారులైన లేదా ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఎదురు చూస్తున్నట్లయితే కచ్చితంగా మొలకెత్తిన పెసలు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
సుమారు 100 గ్రాముల పెసర మొలకలలో నాలుగు గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. గుడ్లు, చికెన్ లేదా ఇతర జంతు ఆధారిత ప్రోటీన్లతో పోల్చుకుంటే ఇది కాస్త ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు.
మొలకెత్తిన పెసలు తినడం వల్ల ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు అలాగే గోళ్ళు కూడా పొందవచ్చు. చర్మాన్ని రిపేర్ చేయడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే ప్రోటీన్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. శరీరం పోషకాలను గ్రహించడం వల్ల వేగంగా జీర్ణం అవుతాయి.
అంతేకాదు వీటిలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. రక్తంలో చక్కర స్థాయి నియంత్రించడంలో సహాయపడుతుంది. అధిక బరువు ఉన్నవారు వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి.
యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఫ్రీ రాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ కారకాలను దూరం చేస్తాయి. దీర్ఘకాలిక వ్యాధి ప్రమాదం కూడా తగ్గుతుంది.
గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, రక్తప్రసరణను మెరుగుపరిచి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.