Microsoft Outage: బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటే?.. దీనిపైన ఐటీ నిపుణులు చెబుతున్న విషయాలు ఇవే..
ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో చాలా మంది యూజర్లకు ల్యాపీలు, పీసీల మీద బ్లూ లైన్ ఎర్రర్ ల దర్శనమిచ్చాయి. దీంతో వినియోగ దారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. సామాజిక మాధ్యమంలో తమ టెక్నికల్ సమస్యల స్క్రీన్ షాట్ లను తీసి పోస్టులు చేశారు.
ఇదిలా ఉండగా.. కాసేపటికి మనదేశంలో పాటు, లండన్, అమెరికా, ఆస్ట్రేలియాలు సైతం ఈ టెక్నికల్ సమస్యతో వారి సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. దీని వల్ల ఆన్ లైన్ సర్వీసులు, బ్యాంక్ లు, విమానయాన సర్వీసులు, టెకీలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ విండోస్ 365 యాప్ లో ఏర్పడిన సమస్యల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఈవిధంగా టెక్నికల్ ఎర్రర్ ఏర్పడినట్లు సంస్థ ప్రకటించింది. దీంతో అత్యవసర సర్వీసుల సేవలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనాలుఎక్కడికక్కడ టెక్నికల్ ఎర్రర్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు.
కొన్నిగంటల నుంచి ఈ సమస్య అదే విధంగా ఉంది. అంతేకాకుండా.. స్టాక్స్ , ట్రెడింగ్స్ కూడా దీని వల్ల ఎఫెక్ట్ అయినట్లు తెలుస్తోంది. కొన్ని దేశాల్లో ఆన్ లైన్ తో అనుసంధానమై ఉన్న పోలీసుల వ్యవస్థలు సైతం ఎర్రర్ వస్తున్నట్లు సమాచారం. చాలా మంది అత్యవరసర కాల్స్, ఎమర్జెన్సీ కాల్స్ లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనేది టెక్నికల్ ఎర్రర్. దీని వల్ల ల్యాపీలు, డెస్క్ టాప్ లు బ్లూకలర్ లో ఎర్రర్ వస్తుంది. అదే విధంగా సిస్టమ్ లను షట్ చేయాలని కూడా సూచలను వస్తుంటాయి. బీఎస్ ఓడీ సమస్య వల్ల స్క్రీన్ మీద బ్లూ లైన్ ను కన్పిస్తుంది. విండోస్ సరిగ్గా లోడ్ కాలేదని, రిస్టార్ట్ చేయమని కూడా సిస్టమ్ మీద నోటిఫికేషన్ కన్పిస్తుంది. దీంతో మనం పీసీలు కానీ, ల్యాపీలు కానీ ఓపెన్ చేయడం సాధ్యపడదు. కొన్నిసార్లు సాఫ్ట్ వేర్ లకు కూడా బగ్ లు, మాల్వేర్ సమస్యలు వస్తుంటాయని, వీటిని కొన్నిగంటల్లో పరిష్కరించవచ్చని ఐటీ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం సంభవించిన బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ సమస్యవల్ల ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆన్ లైన్ సర్వీసులు,విమానాలు, స్టాక్స్ లు, బ్యాంకింగ్ లు, అత్యవసర సర్వీసులకు తీవ్ర ఆంతరాయం ఏర్పడింది. దీన్ని వెంటనే పరిష్కరించాలని కూడా కోరుతూ యూజర్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. దిగ్గజ మైక్రోసాఫ్ట్ కంపెనీ నిపుణులు ఈ సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.