Sana Ganguly: తల్లి డ్యాన్సర్‌.. తండ్రి స్టార్‌ క్రికెటర్‌.. ఆసక్తికరమైన సనా గంగూలీ ఎంచుకున్న కెరీర్‌ ఏంటో తెలుసా?

Fri, 23 Aug 2024-9:24 am,

బీసీసీఐ మాజీ చీఫ్‌ కూతురు ఈ సనా గంగూలీ. ఆమె 2001 నవంబర్‌ 3న జన్మించింది.  తల్లి ఒడిస్సీ డ్యాన్సర్‌, తండ్రి పెద్ద స్టార్‌ క్రికెటర్‌. మంచి పేరుప్రఖ్యాతలు కలిగిన పేరెంట్స్‌ ఉన్నారు.   

సనా గంగూలీ కెరీర్‌ వివరాలు తెలుసుకుందాం. సనా లోరెటో హైజ్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె ప్రతిభావంతురాలు. ఈ లోరెటో హౌజ్‌ అత్యంత పురాతమైన ఇనిస్టిట్యూట్‌.   

ఇక ఇంటర్మీడియేట్‌ విద్యలో సనా గంగూలీ 98 శాతం మార్కులు సంపాదించారు. బోర్డు పరీక్షల్లో కూడా ఆమె ప్రతిభవంతురాలు అని నిరూపించుకున్నారు.  

యూకేలోని యూనిశర్శిటీ కాలేజ్‌ లండన్‌ దీన్ని 1836లో స్థాపించారు. ఇది కూడా అత్యంత పురాతనమైన విశ్వవిద్యాలయంలో ఒకటి. ఇక పై చదువుల కోసం సనా గంగూలీ బీఎస్సీ ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు.    

సనా గంగూలీ లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌ ప్రకారం కెరీర్‌ విషయానికి వస్తే సనా గంగూలీ పీడబ్ల్యూసీ, డెలాయిట్‌లో ఇంటర్న్‌షిప్‌లు పూర్తి చేశారు. ఆ తర్వాత ఇన్నోవెర్వ్‌లో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు.  

సనా గంగూలీ మోర్గాన్‌ స్టాన్లీ వెల్త్‌ మేనేజ్మెంట్‌లో అనలిస్ట్‌గా కూడా పనిచేశారు. ఇక సనా గంగూలీ కూడా తల్లిలాగే మంచి ఒడిస్సీ డ్యాన్సర్‌ కూడా.. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link