Foods Help In Joint Pains: కాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా..? ఈ ఆహార పదార్థాలతో చెక్ పెట్టండి
చాలా మంది వృద్ధులు కీళ్ల నొప్పి, ఎముకల నొప్పితో బాధపడుతుంటారు. దీని కారణంగా వారి పనులు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురుకుంటారు. ఈ సమస్యలు రావడానికి కారణం శరీరంలో కాల్షియం ఎక్కువగా ఉంటే ఈ సమస్యలను ఎదురుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఎలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయట పడవచ్చు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఎముకలు బలంగా ఉండాలి అంటే ఎల్లప్పుడు పాలు, నెయ్యి, పెరుగు వంటిని ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో కాల్షియం అధికశాతంలో లభిస్తుంది.
సోయాబీన్‌లు ఎక్కడ కనిపించిన మీరు దీనిని తప్పకుండా మీ డైట్ లో భాగంగా తీసుకోండి. ఇందులో ఎముకలను, కీళ్లను బలంగా తయారు చేసే శక్తి దాగి ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
శరీరంలో ఎముకలు, కీళ్లు బలంగా ఉండాలి అంటే విటమిన్ డి లభించే ఆహారపదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా రాగులను తీసుకోవడం ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో లభించే విటమిన్ డి ఎముకలను దృఢంగా తయారు చేయడంలో సహాయపడుతుంది.
ప్రతిరోజు ఒక అరటిపండు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అరటిపండు ఎముకలను బలంగా తయారు చేయడంలో సహాయపడుతుంది. గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా పాటించే ముందు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.