Types Of Salt: మీకు సరిపోయే ఉప్పును ఎలా ఎంచుకోవాలి? ఎందులో ఏ ప్రత్యేకత ఉందో తెలుసా?

సాధారణ ఉప్పు.. ఉప్పులో ప్రధానమైన సోడియం రక్తపోటును నియంత్రించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.ఈ ఉప్పు అయోడిన్ లోపాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది. జీర్ణ ఎంజైమ్‌లు, కడుపు ఆమ్లాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.

కోషర్ ఉప్పు.. తక్కువ సోడియం తినమని డాక్టర్లు సలహా ఇచ్చే వ్యక్తులకు మంచిది. అయోడిన్ లేకుండా స్వచ్ఛమైన ఉప్పు కోసం చూస్తున్న వారికి ఇది మంచిది.

సెల్టిక్ ఉప్పు.. ఇది సోడియం ఇతర ఎలక్ట్రోలైట్‌ల సహజ సంతులనాన్ని కలిగి ఉంటుంది.రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నవారికి ఇది మంచిది, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేస్తుంది.
లో సోడియం ఉప్పు.. తక్కువ సోడియం ఆహారం అవసరమయ్యే అధిక రక్తపోటు లేదా గుండె జబ్బులతో బాధపడుతున్న వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. కిడ్నీ వ్యాధి లేదా పొటాషియం విసర్జనకు ఆటంకం కలిగించే ఇతర పరిస్థితులు ఉన్నవారికి పొటాషియం అధికంగా తీసుకోవడం హానికరం .
సముద్ర ఉప్పు.. జీర్ణక్రియకు సముద్రపు ఉప్పు ఎంతో సహాయం చేస్తుంది. ఇందులో పొటాషియం ,మెగ్నీషియం, సోడియం ప్రభావాలను సమతుల్యం చేయడం ద్వారా రక్తపోటును నియంత్రిసతుంది. అంతేకాదు ఇందులో మినరల్స్ ,మెగ్నీషియం, కాల్షియం ,పొటాషియం వంటి మూలకాలు ఉన్నాయి
పింక్ సాల్ట్.. ఈ ఉప్పులో ఉన్న సోడియం ఇతర ఎలక్ట్రోలైట్స్ సహజ సంతులనం పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఇనుము, జింక్ ఉంటుంది.
నల్ల ఉప్పు.. ఇది జీర్ణక్రియకు సహాయం చేయడం, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. సల్ఫర్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)