Gold and Silver Things: బంగారం, వెండితో కూడుకున్న నమ్మకాలు, అపనమ్మకాలు..పోగొట్టుకుంటే ఏం జరుగుతుంది

శాస్త్రాల ప్రకారం కుడి కాలు పట్టీ పోతే సామాజిక ప్రతిష్ఠ తగ్గిపోతుందట. అటు ఎడమకాలి పట్టీ పోతే..ఏదో తెలియని దుర్ఘటన జరగవచ్చట.

ఇటీవలి కాలంలో బంగారం లేదా వెండి ఉంగరాల్ని చాలామంది ధరిస్తున్నారు. శాస్త్రం ప్రకారం బంగారం లేదా వెండి ఉంగరం పోతే..ఓ విధమైన అశుభమేనట. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందట

శాస్త్రాల ప్రకారం చెవి ఉంగరాలు లేదా వస్తువులు పోగొట్టుకుంటే..అశుభమే. దీనివల్ల భవిష్యత్తులో ఏదో చెడు జరుగుతుందని చెబుతారు. అదే సమయంలో ముక్కు పుడకలు వంటివి పోవడం కూడా అశుభమే. ఇలా జరిగితే తీవ్ర అవమానాలు ఎదురౌతాయట.
శాస్త్రాల ప్రకారం గాజులు లేదా బ్రేస్‌లెట్ పోగొట్టుకోవడం అశుభమే..దీనివల్ల పరువు గౌరవ మర్యాదలు తగ్గుతాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారు ఆభరణం లభించడం లేదా కోల్పోవడం రెండూ అశుభమేనట. అందుకే బంగారం లేదా వెండి ఎక్కడైనా దొరికితే..తీసుకురాకూడదని పెద్దలు అంటుంటారు. వాస్తవానికి ఇదంతా గురుడితో సంబంధంతో ఉంటుందట. బంగారం పోగొట్టుకుంటే..నిజ జీవితంలో గురుడి అశుభ ప్రభావం ఉంటుందట.