WhatsApp Amazing Features: ఈ వాట్సాప్ ఫీచర్స్‌ను మీరు ట్రై చేశారా!
కరోనా వైరస్ వ్యాప్తి మరియు లాక్‌డౌన్ సమయంలో వాట్సాప్ వీడియో కాల్స్ పరిమితిని 4 నుంచి 8కి పెంచింది WhatsApp. గతంలో కేవలం గ్రూప్ వీడియో కాల్ నలుగురికి మాత్రం చేయడానికి వీలుండేది. తాజా ఫీచర్‌తో గరిష్టంగా 8 మంది వాట్సాప్ వీడియో కాలింగ్ (WhatsApp Video Calling) చేసుకోవచ్చు. ఈ వీడియో కాల్ ఫీచర్‌ను ఎప్పుడూ ఉపయోగించకపోతే, దయచేసి ఒకసారి ప్రయత్నించండి.
వాట్సాప్ తీసుకొచ్చిన మరో సరికొత్త ఫీచర్ WhatsApp Payments. ఇటీవల వాట్సాప్ చాటింగ్‌తో పాటు యూపీఐ చెల్లింపు విధానాన్ని వాట్సాప్‌లో చేర్చారు. ఇప్పటి వరకు మీరు Paytm, Google Pay మరియు Phone Pay వంటి యాప్స్ ద్వారా నగదు చెల్లింపులు చేసేవారు. ఇకనుంచి వాట్సాప్ పేమెంట్ సర్వీస్ ద్వారా ఏదైనా చెల్లింపు లేదా నగదు బదిలీ కోసం ఈ సౌకర్యాన్ని ఉపయోగించవచ్చు.
వాట్సాప్‌లో ఎక్కువ మందితో చాట్ చేసేవారికి, ఎక్కువ గ్రూపులలో సమాచారం చేరవేసే వారికోసం అందుబాటులోకి తెచ్చిన సర్వీస్ WhatsApp Advance Search. వాట్సాప్ అడ్వాన్స్ సెర్చ్ ద్వారా ఇప్పుడు ఏదైనా చాట్ లేదా ఫైల్‌ను సులభంగా వెతకవచ్చు.
ఈ సంవత్సరం మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ కస్టమర్లకు అందించిన మరో ఫీచర్ WhatsApp Dark Mode. వాట్సాప్ డార్క్ మోడ్ ఫీచర్ ఈ రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. గూగుల్, ఫేస్‌బుక్ మరియు మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు తమ అనేక ఉత్పత్తులకు Dark Modeను తీసుకురావడం తెలిసిందే. మీరు కూడా మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ డార్క్ మోడ్ ఆప్షన్‌ను ప్రయత్నించండి.
Also Read: Motor Vehicle New Rules: వాహనదారులు తెలుసుకోవాల్సిన కొత్త రూల్స్ ఇవే!
వాట్సాప్‌లో ప్రతిరోజూ చాలు ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్ మెస్సెజ్‌లు వస్తుంటాయి. కొందరికి వేల సంఖ్యలో రోజువారీ అప్‌డేట్స్ ఉంటాయి. దీంతో ప్రతిసారి గ్యాలరీలోకి వెళ్లి ఫొటోలు, వీడియోలను డిలీట్ చేయడం కొంచె కష్టం. కానీ వాట్సాప్ కొత్త ఫీచర్ File Delete Feature in WhatsApp సహాయంతో మీరు నేరుగా ఫైల్స్ (Files)ను ఒకేసారి సులభంగా గుర్తించవచ్చు, మరియు తొలగించుకోవచ్చు.
Also Read : Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!