Whatsapp Scam Calls: వాట్సప్ స్కామ్ కాల్స్ నుంచి ఎలా బయటపడాలి
వాట్సప్ కాల్ చేసేటప్పుడు లింక్ పంపించి క్లిక్ చేయమని కోరితే అస్సలు స్పందించవద్దు. లేదా మాల్‌వేర్ డౌన్‌లోడ్ చేయమని అడిగినా రెస్పాండ్ కావద్దు.
ఎవరైనా తెలియని వ్యక్తి వాట్సప్ కాల్ చేస్తే ఆ వాయిస్ క్వాలిటీ పసిగట్టాలి. ఎందుకంటే నేరగాళ్లయితేనే గొంతు మార్చుతుంటారు. గొంతు మెషీన్ వాయిస్‌లా ఉండవచ్చు.
ఎవరైనా వాట్సప్ కాల్ చేస్తే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నేరగాళ్లు మిమ్మల్ని తొందరపెట్టి నిస్సహాయుల్ని చేస్తుంటారు. మీ బ్యాంక్ ఎక్కౌంట్ ప్రమాదంలో ఉందని తప్పులు చేయించేందుకు ప్రయత్నిస్తారు. వాటికి స్పందించవద్దు.
ఎప్పుడైనా మీకు ఎవరైనా తెలియని నెంబర్ నుంచి వాట్సప్‌కు ఫోన్ వచ్చి వ్యక్తిగత విషయాలు, బ్యాంక్ వివరాల గురించి ఆరా తీస్తే అప్రమత్తమవాలి. అసలు అలాంటి కాల్స్ రిసీవ్ చేసుకోకూడదు.
వాట్సప్‌కు ఏదైనా తెలియని నెంబర్ నుంచి ఫోన్ వస్తే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే దీనివల్ల మోసాలు జరగవచ్చు.