Bhavika Mangalanandan: దెయ్యాలు వేదాలు వళ్లించి నట్లుంది.. పాక్‌కు మరోసారి బుద్ది చెప్పిన భారత్.. భవిక మంగళానందన్ ఎవరు..?.. ఆమె ఏమన్నారంటే..?

Sat, 28 Sep 2024-1:28 pm,

ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 79 వ సమావేశం జరుగుతుంది. ఈ నేపథ్యంలో యూఎన్వో లోని సభ్య దేశాలన్ని పాల్గొన్నాయి. భారత్ నుంచి దౌత్యవేత్త భవికా మంగళనాందన్ కూడా ఈ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన సమావేశంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాక్ అంశాన్ని మరోసారి లేవనెత్తారు. జమ్ములో ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని, 2019 లో అనాలోచితంగా ఆర్టికల్ 370 ను రద్దు చేశారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 

జమ్ము ప్రజలు.. స్వేచ్చా, నిర్ణయాధికారం కోసం పోరాడుతున్నారని అన్నారు. యూఎన్ వోసభలో 20నిమిషాలు ప్రసంగిచ షెహబాద్ జమ్ముపైనే ఎక్కువగా మాట్లాడారు. పాలస్తీనా ప్రజల మాదిరిగానే..జమ్ము ప్రజలు కూడా శాంతిని కోరుకుంటున్నారని షరీఫ్ అన్నారు. ప్రస్తుతం జమ్ములో రెండు విడతలుగా ఎన్నికలు ముగిశాయి. మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో షరీఫ్ మాట్లాడిన మాటలు మాత్రం మంటల్ని రాజేశాయి. దీనికి భారత దౌత్యవేత్త భవికా మంగళానందన్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. 

పాక్ ప్రధాని చెప్తున్న మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వళ్లిస్తున్నట్లు ఉన్నాయన్నారు. పాక్ నిజస్వరూపం ఏంటో ప్రపచం దేశాలకు తెలుసని చురకలు అంటించారు.  సుదీర్ఘకాలం సీమాంతార ఉగ్రవాదం ను పెంచిపోషించిన వాళ్లు తమకు నీతులు చెప్తున్నారని మండిపడ్డారు.

ఎన్నికలలో రిగ్గింగ్ లకు పాల్పడే దేశం, ఎప్పుడు చూసిన ఉగ్రవాద కార్యకలాపాలతో అట్టుడుకుతున్న దేశం, పిరికి పందల మాదిరిగా, దొంగ చాటున దాడులకు పాల్పడే దేశం తమకు నీతులు చెప్తుందా అంటూ మండిపడ్డారు. 

ఉగ్రవాదంకు కేరాఫ్ గా చెప్పుకునే పాక్.. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ కు నీతులు చెప్పడం విడ్డూరమన్నారు. అదే విధంగా జమ్ముకశ్మీర్ లు, లద్దాఖ్ లు భారత్ లో అంతర్భాగమంటూ స్పష్టం చేశారు. పాక్ కావాలని మరోమారు యూఎస్ వో వేదకగా జమ్ము గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది.

అందుకు 2001లో భారత పార్లమెంట్‌పై దాడి అదే విధంగా.. 2008లో ముంబయిలో దాడి ఘటనలను ఈ సందర్భంగా భావిక మంగళానందన్ ప్రస్తావించారు. దీనితో పాటు.. 1971లో బంగ్లాదేశ్  మారణహోమానికి పాల్పడి, మైనారిటీలను నిర్ధాక్షిణ్యంగా వేధిస్తున్న దేశం ఇప్పుడు కూడా సహానం, శాంతిల గురించి మాట్లాడితే నవ్వోస్తుందన్నానరు. ఒసామా బిన్ లాడెన్‌కు ఆతిథ్యమివ్వడంతోపాటు భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడంలో పాకిస్థాన్‌ కీలకపాత్ర పోషిస్తోందని ఆమె మండిపడ్డారు .  

ప్రస్తుతం ఐరాసలో పాక్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన భావికా మంగళా నందన్ ఎవరని ప్రస్తుతం చాలా మంది సెర్చింగ్ చేస్తున్నారు. భావికా మంగళానందన్ ఐక్యరాజ్యసమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధిగా పనిచేస్తున్న భారతీయ దౌత్యవేత్త. మంగళానందన్ 2015 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి.ఆమె విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కూడా అండర్ సెక్రటరీగా కూడా పనిచేశారు.  

మంగళానందన్ 2011 సంవత్సరంలో   ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ ( IIT- ఢిల్లీ) నుండి ఎనర్జీ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఆమె ప్రస్తుతం తీవ్రవాద వ్యతిరేకత,  సైబర్ భద్రత, 1వ కమిటీ (నిరాయుధీకరణ మరియు అంతర్జాతీయ భద్రత), GA కోఆర్డినేషన్, UNలో భారతదేశం (ఐక్యరాజ్యసమితికి భారతదేశ శాశ్వత మిషన్, న్యూయార్క్) మొదటి కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

నవంబర్ 2007 నుండి జూన్ 2009 వరకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో అసిస్టెంట్ సిస్టమ్స్ ఇంజనీర్‌గా కూడా పనిచేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత..  జూన్ 2011 నుండి అక్టోబర్ 2012 వరకు ష్నైడర్ ఎలక్ట్రిక్‌లో సీనియర్ ఇంజనీర్ మార్కెటింగ్‌గా కూడా పనిచేసినట్లు తెలుస్తోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link