Brunei Sultan: ఎవరీ సుల్తాన్‌? 7000 పైగా కార్లు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాలెస్‌ ఉన్న కింగ్‌.. నేడు మోదీకి ఆతిథ్యం..

Tue, 03 Sep 2024-3:19 pm,

సుల్తాన్‌ హస్సనాల్‌ బొల్కియా ఈయన ప్రపంచంలోనే ఎక్కువకాలం రాజుగా పనిచేసిన రెండో చక్రవర్తి.  ఇతనీ లైఫ్‌స్టైల్‌ లగ్జరీయస్‌గా ఉంటుంది. ఈ సుల్తాన వద్ద దాదాపు 7 వేలకు పైగా లగ్జీరీ కార్‌ కలెక్షన్‌ ఉందట. అంతేకాదు బంగారుపూత పూసిన విమానం కూడా ఈయన సొంతం  

ప్రపంచంలోనే ఎక్కువ కార్లు కలిగిన వ్యక్తి. వీటి విలువ దాదాపు 5 బిలియన్ డాలర్లు, ఇందులో 600 రోల్స్‌ రాయిస్‌ కార్లు ఉన్నాయి. దీనికి ఆయనకు గిన్నీస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డు కూడా సొంతం చేసుకున్నారు. అంతేకాదు 450 ఫెర్రారీ, 380 బెంట్లీ కార్‌ కలెక్షన్స్‌ కూడా ఉన్నాయి.  

ఈ సుల్తాన్‌ వద్ద ది సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌, కార్‌బజ్ ప్రకారం పోర్షే, లాంబోర్గినీ, మేబక్స్, జాగ్వార్‌, బీఎండబ్ల్యూ, మెక్‌లారెన్స్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయట. బెంట్లీ డామినేటర్‌ ఎస్‌యూవీ అయితే, 80 మిలియన్‌ డాలర్లు, పోర్షే 911 హరిజాన్ బ్లూ పెయింట్‌ 24 క్యారట్ల గోల్డ్‌ ప్లేటెడ్‌ రోల్స్‌ రాయిస్‌ సిల్వర్‌ స్పర్‌ II కలిగి ఉన్నారు. ఇది ఓపెన్‌ రూఫ్ తో గొడుగుతో బంగారంతో తయారు చేశారు.  

2007 తన కూతురు మజేడేదా పెళ్లికి బంగారంతో తయారు చేసిన మరో రోల్స్‌ రాయిస్‌ను  కూడా కొనుగోలు చేశారు. సుల్తాన్‌ బొల్కీయా ఈ కార్‌ కలెక్షన్‌ చూస్తే ఆయన లగ్జరీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఈ సుల్తాన్‌ ఇస్తానా నూరుల్‌ ఇమాన్‌ ప్యాలస్‌లో ఉంటారు. ఇది కూడా ప్రపంచంలో అతిపెద్ద ప్యాలస్‌ అని గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంది.  

ఈ ప్యాలస్‌ రెండు మిలియన స్కేర్‌ ఫీట్‌ ఉంటుంది. 22 క్యారట్ల గోల్డ్‌ ఉపయోగించి కట్టారు. ఈ ప్యాలస్‌లో 5 స్విమ్మింగ్‌ పూల్స్‌, 1700 బెడ్‌రూమ్స్, 257 బాత్‌రూమ్స్‌, 110 గ్యారేజ్లు కలిగి ఉంది. నేడు మన భారత ప్రధాని ఈ బ్రూనై సుల్తాన్‌ బొల్కీయాను కలవనున్నారు. దీంతో ఈ రాజు పేరు ఒక్కసారిగా ఈ చక్రవర్తి పేరు తెరమీదకు వచ్చింది.   

మరో అద్భుత విషయం ఏంటంటే ఈ చక్రవర్తి వద్ద బంగారం పూత పూసిన విమానం కూడా ఉంది. బ్రూనైలో ముఖ్యంగా ఆయిల్‌, గ్యాస్‌ రిజర్వ్‌లు కలిగి ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సుల్తాన్‌ను కలవనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడేందుకు 40 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో కూడా కలిసి ముందుకు వెళ్లడానికి ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link