Usha Chilukuri: ఉషా చిలుకూరీ ఎవరు..?.. అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇటీవల దుండగుడి దాడి నుంచి కొంచెంలో బైటపడ్డారు. 20 ఏళ్ల మాథ్యు అనే యువకుడు.. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ నేపథ్యంలో.. ఆయన మోకాళ్ల మీద కూర్చుని బుల్లెట్ ప్రమాదం నుంచి బైటపడ్డారు.
ఇదిలా ఉండగా.. ట్రంప్ ఇలాంటివాటిని భయపడేది లేదని తెల్చి చెప్పారు. అంతేకాకుండా.. మరల ప్రచారం నిర్వహించారు.ఈ క్రమంలో ట్రంప్.. సోమవారంనాడు అమెరికా ఉపాధ్యక్ష పదవికి జేడీ వాన్స్ ను నామినేట్ చేశారు. దీంతో అక్కడున్న వారంతా జీడీ వాన్స్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన ఈ పదవికి అన్ని విధాలుగా తగిన వాడంటూ కూడా ప్రవాస భారతీయులు జేడీ వాన్స్‌ను అభినందించారు. మరోవైపు.. జేడీ వాన్స్ సతీమణికి భారత మూలాలున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఒక్కసారిగా భారతీయులు, నెటజన్లు జేడీ వాన్స్ సతీమణి ఎవరు అని గూగుల్ లో విపరీతంగా సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ఉషా చిలుకూరి భారతీయ వలసదారుల దంపతుల అమ్మాయని తెలుస్తోంది. ఆమె తల్లిదండ్రులు చాలా వేళ్ల కిందటే ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లి అమెరికాకు వచ్చి అక్కడ స్థిరపడినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. ఉషా కూడా కాలిఫోర్నియాలోనే జన్మించారు. ఉషా చిలుకూరి తల్లిదండ్రులది ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పామర్రు వద్ద ఉన్న చిన్న గ్రామం.
ఇదిలా ఉండగా.. ఉషా చిలుకూరి శాన్ డియాగో, కాలిఫోర్నియాలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ప్రస్తుతం ఉషా చిలుకూరి వయసు 38 ఏళ్లు. మరోవైపు.. ఉషా చిలుకూరి-జేడీ వాన్స్ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. ప్రఖ్యాత యేల్ విశ్వవిద్యాలయం నుంచి చరిత్రలో బీఏ చేశారు. మోడర్న్ చరిత్ర ఉషకు ఎంతో ఇష్టమైన సబ్జెక్ట్ గా తెలుస్తోంది.
ప్రఖ్యాత యేల్ విశ్వవిద్యాలయం నుంచి చరిత్రలో బీఏ చేశారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆధునిక చరిత్రలో ఎంఫిల్ పట్టా పొందారు. యేల్ వర్శిటీలో ఉన్నప్పటి నుంచే జేడీ వాన్స్ - ఉషా చిలుకూరి ప్రేమించుకున్నారు. ఆ పరిచయమే పెళ్లి వరకు చేరింది. ఎంఫీల్ పూర్తవగానే 2018లో అమెరికా సుప్రీం కోర్ట్‌కు లా క్లర్క్, శాన్‌ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీలోని ముంగెర్, టోల్లెస్, ఓల్సన్‌లో పనిచేశారు.
జేడీ వాన్స్‌తో ఉషా చిలుకూరి 2014లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కాలిఫోర్నియాలో హిందూ సంప్రదాయం ప్రకారమే జరిగింది. జేడీ వాన్స్ రాజకీయ ప్రయాణంలో ఉషా చిలుకూరి వెనుక ఉండి నడిపిస్తుంటారని చెబుతుంటారు. ఒక పక్క కుటుంబాన్నీ మరోపక్క ముగ్గురు పిల్లల్ని చూసుకుంటున్న ఉష మన తెలుగింటి అమ్మాయి కావడం గర్వకారణమని అందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.