Paris olympics 2024: పారిస్ లో దుమ్మురేపుతున్న భారత ఆణిముత్యం.. రెజ్లర్ నిషా దహియా గురించి ఈ విషయాలు తెలుసా..?

Mon, 05 Aug 2024-4:12 pm,

పారిస్ ఒలింపిక్స్ లో విశ్వక్రీడలు నడుస్తున్నాయి. ఇప్పటికే భారత్ కు మూడు కాంస్య పతకాలు వచ్చాయి. రెండు పతకాలను మనూబాకర్ గెల్చుకొగా, షూటర్ స్వప్నిల్ కూడా కాంస్యం గెలుచుకున్నాడు. ఐదురోజుల వ్యవధిలో భారత్ కు మూడు పతకాలు వచ్చాయి. 

 

ఇప్పటికే వినేశ్‌ ఫొగట్‌ (50 కి), అంతిమ్‌ పంగల్‌ (53 కి), అన్షు మాలిక్‌ (57 కి), రితికా హుడా (76 కి) పారిస్‌ విశ్వ క్రీడలకు బెర్త్‌ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరంతా తమదైన స్టైల్ లొ ఒలింపిక్స్ లో బరిలోకి దిగి సత్తా చాటుతున్నారు.  

హర్యానాకు చెందిన ఇండియన్ రెజ్లర్. మహిళల 68 కేజీల విభాగంలో ఆమె ప్రీస్టైల్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఈవెంట్లో బర్త్ సంపాదించిన ఐదవ క్రీడాకారిణిగా సత్తా చాటింది.

నిషా దహియా జులై 20, 1997 హర్యాలో జన్మించింది. ఆమె 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే కుస్తీలో అద్భుతమైన ప్రతిభను కనబర్చింది. అప్పటి నుంచి ఇంట్లో వాళ్లు ఆమెను ప్రొత్సహించి, కోచ్ మార్గదర్శకత్వంలో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇప్పించారు.

నిషా దహియా రెజ్లింగ్ రాణించడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు.  అదే విధంగా.. డొపింగ్ కారణంగా నాలుగేళ్లపాటు రెజ్లింగ్ కు దూరమైనారు. అయిన కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా.. 2019  లో అండర్ 23, జాతీయ ఛాంపీయన్షిప్ ను గెల్చుకున్నారు.

గతంలో కొన్నిసార్లు నిషాదహియా చనిపోయిందని కూడా తప్పుడు ప్రచారాలు జరిగాయి. కొంత మంది కావాలని నిషాకు చెడ్డపేరు వచ్చేలా ఆమెను ట్రోల్ చేశారు. వీరందరికి కూడా నిషా దహియా తనదైన స్టైల్ లో రివర్స్ కౌంటర్ ఇచ్చింది.  

నిషా దహియాకు, కుటుంబం, కొందరు స్నేహితులు ఎంతో అండగా నిలిచారు.ఈ నేపథ్యంలో నిషా. 2021లొ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో,మహిళల ప్రీస్టైల్  65 కేజీల విభాగంలో.. కాంస్యపతకం గెల్చుకుంది.  

అదే విధంగా 2022 లో 68 కేజీల విభాగంలో అనూహ్యంగా ఓటమిపాలవ్వగా, 2023 ఆసియా రెజ్లింగ్ ఛాంఫియన్ విభాగంలో రజతం గెల్చుకుంది.అదే విధంగా..మే 2024 ఇస్తాంబుల్ లో..ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్స్ లో పారిస్ 2024 ఒలింపిక్స్ లో అర్హత సాధించింది. సెమిఫైనల్స్ లో.. రొమెనియాకు చెందిన అలెగ్జాండ్రా ఏంజెల్ ను ఓడించి తన స్థానాన్ని పదిలం చేసుకుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link