Puja khedkar: సంచలనంగా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ నిర్వాకం.. వెలుగులోకి వచ్చిన మరిన్ని షాకింగ్ విషయాలు..

Thu, 18 Jul 2024-11:56 pm,

మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ట్రైనీ  ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ప్రస్తుతం వివాదాలకు కేరాఫ్ గా మారారని చెప్పుకొవచ్చు. పూజా ఖేడ్కర్ అనేక అబద్ధాలు చెప్పి ఐఏఎస్ ఉద్యోగం పొందారని కూడా విమర్శలు వస్తున్నాయి. దీనిపై అధికారులు సైతం విచారణకు ఆదేశించారు.  ఈ క్రమంలో పూజా ఖేద్కర్, ఆమె తల్లిదండ్రులు మనోరమా, దిలిప్ ఖేడ్కర్ సైతం వార్తలలో నిలిచారు.

డాక్టర్ పూజా ఖేడ్కర్ 2023 బ్యాచ్‌కి చెందిన IAS అధికారిణి. యూపీఎస్సీలో 841 ర్యాంకు సాధించినట్లు తెలుస్తోంది. పూజా తండ్రి కూడా రిటైర్డ్ అధికారి. పూజిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరండంతో పూజా ఖేద్కర్ కోరడం వివాదం రాజుకుంది. ట్రైనీ గా ఉన్నప్పుడు కొన్ని సదుపాయాలు ఉండవు. కానీ పూజా ఖేడ్కర్ మాత్రం తనకు ప్రత్యేకమైన గది, ఎర్రబుగ్గ కారు ఉండాలని కూడా పట్టుబట్టారు.

ఏకంగా కలెక్టర్ లేనప్పుడు ఆయన గదిలోకి ప్రవేశించి, ఆయన ఫర్నీచర్ ను తన గదిలో షిఫ్ట్ చేసుకున్నారు.  తన పేరుతో ప్లేట్ సైతం పెట్టుకున్నారు. అంతేకాకుండా.. విజిటింగ్ కార్డ్, పేపర్ వెయిట్, నేమ్‌ప్లేట్, రాజముద్ర, ఇంటర్‌కామ్ అందించాలని రెవెన్యూ అసిస్టెంట్‌ను ఆదేశించారు.  దీనిపై పూణె కలెక్టర్ సీఎస్ కు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో ఆమెను వెంటనే మరోక చోటికి ట్రాన్స్ ఫర్ చేశారు.

ఈ క్రమంలో ఆమె ఫెక్ దివ్యాంగ  పత్రాలు సబ్మిట్ చేసి జాబ్ పొందారని కూడా వార్తలు వచ్చాయి. ఆమె చూపిన పత్రాల్లో ఇంటి చిరునామా కాకుండా.. ఒక ఫ్యాక్టరీ అడ్రస్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా.. మెడికల్ టెస్టుల కోసం కూడా రాకుండా.. పలు పర్యాయాలు వాయిదావేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వేరే చోట ఎంఆర్ఐ చేయించి, దాన్ని యూపీఎస్సీకి సబ్మిట్ చేశారని, దీని వెనుక అనేక మంది రాజకీయ నేతల హస్తముందని కూడా ప్రచారం జరుగుతుంది.

పూజా ఖేడ్కర్ ఎంబీబీఎస్ చదవడంపై కూడా పలు వివాదాలు ఉన్నాయి. ఆమె తన పేర్లను వేర్వేరుగా ఎంటర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు పూణేలోకి వీరి ఇల్లు అక్రమమని పలు పర్యాయాలు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయిన కూడా పూణే రెస్సాండ్ అవ్వలేదు. దీంతో అధికారులు తాజాగా, వీరి నిర్మాణాలను కూల్చివేసినట్లు తెలుస్తోంది.  

మరోవైపు పూజా ఖేడ్కర్ తల్లి.. గన్ పట్టుకుని ఒక రైతును బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో రచ్చగా మారింది. దీనిపైరైతు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఘటన తర్వాత కొన్ని రోజుల పాటు  మనో రమా, దీలిప్ లు ఇద్దరు కన్పించకుండా పోయినట్లు తెలుస్తోంది. మరల పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. 

తాజాగా, రైతును గన్ తో బెదిరించిన కేసులో పోలీసులు.. మనోరమాను అరెస్టు చేశారు. పూజా ఖేడ్కర్ తండ్రి కూడా ఉన్నతస్థాయి అధికారిగా పనిచేశారని, ఆయన అధికారంలో ఉండగా.. ఆదాయానికి మించి అక్రమంగా సంపాదిచారని కూడా వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఆయన పలుమార్లు సస్పెండ్ అయినట్లు కూడా  వార్తలు వెలుగులోకి వచ్చాయి. 

పూజా ఖేడ్కర్ ఉపయోగించిన లగ్జరీ ఆడి కారు.. ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ పేరిట రిజిస్టర్ అయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.  దీనిపై ఇప్పటి వరకు 21 కంప్లైంట్ లు రాగా.. రూ. 27 ల వరకు జరిమానాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా.. ట్రైనీ ఐఏఎఎస్ ఏకంగా.. డీసీపీ ర్యాంక్ గల అధికారిని ఒక చోరీ కేసులో ఒత్తిడి తెచ్చారంట.. దోంగని వదిలేయాలని కూడా హుకుం జారీచేశారంట.  దీనిపై కూడా ప్రస్తుతం తీవ్ర దుమారం చెలరేగింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link