Nagapanchami 2024: శివుడు తన మెడలో కంఠాభరణంగా ధరించే పాము పేరు ఏంటో తెలుసా..?..
బ్రహ్మ, విష్ణువు, శివుడిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. సృష్టి,స్థితి, లయకారకులుగా వీరిని చెప్పుకుంటారు. చాలా మంది శివుడ్ని భోళా శంకరుడిగాను కోలుచుకుంటారు. శివయ్య మీద చెంబు నిండా నీళ్లు పోసి, బిల్వపత్రం సమర్పిస్తే ఆయన మన కోరికలన్ని నెరవేరుస్తాడు.
శివుడు స్మశానంలో ఉంటూ,పులిచర్మం కప్పుకుని, మెడలో పామును ఆభరణంగా వేసుకుంటాడు. ఒంటి నిండా విభూతిని ధరిస్తాడు. చాలా మంది శివుడి మెడలో ఉన్న సర్పంపేరేంటని తెలుసుకొవడానికి ఆసక్తి చూపిస్తుంటారు.
శివుడి అవతారం లీల ఎంతో గొప్పదని చెప్పుకొవచ్చు. ఆయన పులిచర్మం, తలపై గంగమ్మ, చంద్రుడు, ఒంటి నిండా భస్మం, మెడలో పామును ఆభరణంగా ధరిస్తాడు. పూర్వం సముద్ర మథనం అప్పుడు విషం బైటకువస్తుంది.
అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి.. సృష్టి కాపాడతాడంట. అప్పుడు ఆయన తాగిన విషయం కడుపులోకి పోకుండా.. మెడ దగ్గర ఉండేలా.. విష్ణుమూర్తి ఒక సర్పాన్ని ఆయనకు కంఠాభరణంగా ఉండేలా వరమిస్తాడంట.అప్పటి నుంచి వాసుకీ సర్పం శివుడి మెడలో ఉంటుంది.
అంతేకాకుండా.. సర్పాలకు కూడా వాసుకీ సర్పమే రాజని కూడా చెప్తుంటారు. ఈ సారి ఆగస్టు 9 నాగ పంచమి వస్తుంది. ఈ రోజున అందరు పుట్టల దగ్గరకు వెళ్లి సర్పాలకు, సర్ప ప్రతిమలకు పాలతో అభిషేకం చేస్తుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)