Ratan Tata Successor : రతన్ టాటా వారసుడు ఎవరు..ఆ 3800కోట్లు దక్కేది ఎవరికీ?
Ratan Tata: టాటా చరిత్రలో ఒక శకం ముగిసింది. రతన్ టాటా నిష్క్రమణ భారత దేశ వ్యాపార ప్రపంచానికి తీరని లోటు అని చెప్పాలి. అయితే రతన్ టాటా మరణం తర్వాత ఆయనకు చెందిన ఆస్తులు ఎవరికి దక్కుతాయి అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. ఎందుకంటే వేలకోట్లకు అధిపతి అయిన రతన్ టాటాకు వివాహం జరగలేదు. ఆయనకు వారసులు ఎవరూ లేరు.
దీంతో ఆయనకు వ్యక్తిగతంగా ఉన్న సొంత ఆస్తి ఎవరికి చెందుతుంది అనే దానిపైన ప్రతి ఒక్కరిలోనూ సందేహం నెలకొని ఉంది. అయితే అటు టాటా గ్రూప్, టాటా సన్స్ విషయంలో ఒక క్లారిటీ ఉంది ఇప్పటికే ఆ రెండు గవర్నమెంట్ బాడీలకు చైర్మన్ గా నటరాజన్ చంద్రశేఖరన్ కొనసాగుతున్నారు. టాటా వారసుల తరువాతి తరంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. వీరిలో రతన్ టాటా సవతి సోదరుడు, మేనల్లుడు , మేనకోడలు పేర్లు ఉన్నాయి.
నోయెల్ టాటా: రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ నావల్ టాటా, టాటా గ్రూప్ లో కీలక వ్యక్తి. నోయెల్ నావల్ టాటా, సిమోన్ టాటాల కుమారుడు. అతను సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్, JN టాటా ఎండోమెంట్, బాయి హీరాబాయి JN టాటా నవ్‌సారి ఛారిటబుల్ ఇన్‌స్టిట్యూషన్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. అతను టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్, వోల్టాస్ లిమిటెడ్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ , టైటాన్ కంపెనీ లిమిటెడ్ వైస్ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. నోయెల్ నావల్ టాటా కన్సాయ్ నెరోలాక్ పెయింట్స్ లిమిటెడ్ , స్మిత్ పిఎల్‌సి బోర్డులలో కూడా సేవలందిస్తున్నారు.
లియా టాటా: నోయెల్ టాటా పెద్ద కుమార్తె లియా స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లోని IE బిజినెస్ స్కూల్ నుండి మార్కెటింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఆమె 2006 నుండి తాజ్ హోటల్స్ రిసార్ట్స్ అండ్ ప్యాలెస్‌లో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్‌గా చేరినప్పటి నుండి గ్రూప్‌తో అనుబంధం కలిగి ఉంది. ఇప్పుడు ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (IHCL)లో వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తోంది. ఆమె టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ , పబ్లిక్ ట్రస్ట్‌లో కూడా పనిచేస్తున్నారు.
మాయా టాటా: నోయెల్ టాటా చిన్న కూతురు టాటా గ్రూప్ ఆర్థిక సేవల ఫ్లాగ్‌షిప్ - టాటా క్యాపిటల్‌లో విశ్లేషకురాలిగా తన వృత్తిని ప్రారంభించింది. ఒక నివేదిక ప్రకారం, మాయ UKలోని బేయెస్ బిజినెస్ స్కూల్ , వార్విక్ యూనివర్శిటీలో చదువుకుంది.చాలా టాటా కంపెనీల్లో పనిచేశారు. ఆమెను టాటా గ్రూప్ వారసురాలిగా ఉన్నారు.
నెవిల్లే టాటా: నెవిల్లే టాటా నోయెల్ టాటా , అల్లు మిస్త్రీల రెండవ కుమారుడు. అతను గ్రూప్ , రిటైల్ చైన్ ట్రెంట్‌తో తన వృత్తిని ప్రారంభించాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో, అతను టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్, టాటా సన్స్ , ప్రభుత్వం ఏర్పాటు చేసిన లాభాపేక్ష లేని శిక్షణా సంస్థ అయిన టాటా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ బోర్డులో కూడా స్థానం పొందాడు. ఈ సంవత్సరం ముగ్గురూ (లియా, మాయ , నెవిల్లే) 5 ట్రస్టులకు ట్రస్టీలుగా చేశారు.