Tollywood Heroine: ఈ ఫోటోలోని చిన్నారి అక్కినేని అఖిల్ హిరోయిన్.. స్టార్ హీరో వైఫ్.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్..!

సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది సినీ, రాజకీయ సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారడం చూస్తూ ఉంటాం. ఈరోజు కూడా మరో ఆసక్తికరమైన ఫోటో మీ ముందుకు తీసుకువచ్చాం. ఈ ఫోటోలో ఉన్న అందమైన పాప ఓ స్టార్ హిరోయిన్, ఈమె పెళ్లి చేసుకుంది కూడా స్టార్ హీరోని. అంతేకాదు టాలీవుడ్, కొలీవుడ్, సాండల్‌వుడ్ సినిమాల్లో కూడా నటించారు.

ఆమె ఎవరో కాదు అక్కినేని అఖిల్ నటించిన 'అఖిల్' సినిమా హిరోయిన్. ఈ సినిమా 2015లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతేకాదు టెడ్డీ సినిమాలో కూడా ఈమె నటించారు. ఇంతకీ ఆమె ఎవరో కాదు. హిరోయిన్ సయేషా సైగల్. ఈమె మన అక్కినేని అఖిల్ సినిమాలో నటనారంగ ప్రవేశం చేశారు.

సయేషా సైగల్ అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఈమె సూర్య, కార్తీ, విజయ్ సేతుపతి, ఆర్య వంటి స్టార్ నటులతో కూడా హీరోయిన్‌గా పనిచేశారు. ఈమె పెళ్లి చేసుకుంది కూడా తమిళ నటుడు ఆర్యను, వీరిద్దరూ కలిసి 'టెడ్డీ' సినిమాలో నటించారు. ఈ సినిమాకు మంచి పేరు లభించింది.
సయేషా సైగల్, ఆర్యలు సంతోష పీ విజయ్‌కుమార్ సినిమాల్లో నటిస్తుండగా ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరు 2019లో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఎక్కువమందికి అంతగా తెలియని మరో విషయం ఏంటంటే సయేషా సైగల్ ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నటులు సైరాబాను దిలీప్‌కుమార్‌ల మనవరాలు.
సయేషా సైగల్ ఓ బాలీవుడ్ మూవీలో కూడా నటించడం విశేషం. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సయేషా సైగల్ కేవలం ఆమె భర్త ఆర్యతో 'టెడ్డీ' సినిమాలోనే నటించారు. ఆ తర్వాత గత ఏడాది ఓ ఐటెం సాంగ్‌లో కూడా నటించారు. దీనికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన కూడా లభించింది.